Lucky Bhaskar OTT: తెలుగులో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశాడు దుల్కర్ సల్మాన్. ఈ మలయాళ హీరో నటించిన మహానటి, సీతారామం బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తూ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన లక్కీ భాస్కర్ ప్రేక్షకులను మెప్పించింది. క్రైమ్ డ్రామా లక్కీ భాస్కర్ రూ. 111 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మూవీ బడ్జెట్ రీత్యా లక్కీ భాస్కర్ పెద్ద మొత్తంలో లాభాలు పంచింది.
దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లక్కీ భాస్కర్ చిత్రానికి పోటీగా విడుదలైన అమరన్, క చిత్రాలు సైతం హిట్ టాక్ తెచ్చుకున్నాయి. గట్టి పోటీ మధ్య సాలిడ్ వసూళ్లు ఈ చిత్రం రాబట్టింది. అనంతరం విడుదలైన మట్కా, కంగువా డిజాస్టర్స్ కావడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. మరో రెండు వారాలు వసూళ్లు పొందే అవకాశం దక్కింది.
లక్కీ భాస్కర్ థియేట్రికల్ రన్ ముగిసినట్లే. ఈ క్రమంలో ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం చేశారు. లక్కీ భాస్కర్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 28 నుండి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది.
లక్కీ భాస్కర్ మూవీ కథ విషయానికి వస్తే… 80లలో ముంబైలో జరిగిన కథ. హీరో ఒక బ్యాంకు లో క్యాషియర్ గా పని చేస్తుంటాడు. జీవితం అప్పుల మయం. కుటుంబ అవసరాలు కూడా తీర్చలేకపోతూ ఉంటాడు. అందుకే ప్రమోషన్ కోసం చాలా కష్టపడతాడు. కానీ ప్రమోషన్ తనకు రాదు. దాంతో ఆర్థిక నేరాలకు పాల్పడతాడు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తాడు. కోట్లు సంపాదించే స్థాయికి వెళతాడు. ఒక దశలో ఇవన్నీ మానేస్తాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఫ్రాడ్స్టర్ గా మారిన హీరో కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ..
Web Title: Lucky bhaskar movie ott release date
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com