Homeట్రెండింగ్ న్యూస్Tallest Structures : తెలంగాణ సచివాలయం కంటే ముందు ఎత్తైన నిర్మాణాలుగా వీటిదే రికార్డ్

Tallest Structures : తెలంగాణ సచివాలయం కంటే ముందు ఎత్తైన నిర్మాణాలుగా వీటిదే రికార్డ్

Tallest Structures : 23 ఎకరాల్లో, 1200 కోట్ల ఖర్చుతో, ఆరంతస్తుల సముదాయంతో తెలంగాణ వైట్ హౌస్ అలియాస్ నూతన సచివాలయం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే యాగానికి సంబంధించిన పూజలు ప్రారంభమయ్యాయి. ఆయా శాఖల మంత్రులు ఆ క్రతువులో పాల్గొంటున్నారు. ఇక అధికారిక నమస్తే తెలంగాణ పత్రిక అయితే తెలంగాణకు కొత్త వెలుగు వచ్చిందని ప్రచారం చేస్తోంది. ఆంధ్రజ్యోతికి యాడ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇందులో వ్యతిరేక కోణాన్ని గట్టిగా ప్రచారం చేస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రచారం చేస్తున్నట్టు తెలంగాణ సచివాలయ నిర్మాణం అంత గొప్పదా? దీనికి ముందు ఎటువంటి నిర్మాణాలు రికార్డులు సృష్టించాయి? ఒకసారి పరిశీలిస్తే..
ఎత్తయిన సౌధం
ప్రపంచంలోనే పేరున ఎన్నో కట్టడాలకు సరితూగే విధంగా ఉంది సచివాలయం. 17వ శతాబ్దం నాటి ఫ్రాన్స్ లోని వెర్సెల్లేస్ ప్యాలెస్, 18వ శతాబ్దంలో కట్టిన లండన్ బకింగ్ హం ప్యాలెస్, వాషింగ్టన్ లోని క్యాపిటల్ బిల్డింగ్, 20వ శతాబ్దంలో కట్టిన జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా పార్లమెంట్ భవనాలకు దీటుగా నేటి సచివాలయం నిలుస్తోంది. అంతేకాదు దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు తెలంగాణ సచివాలయం కంటే తక్కువ ఎత్తయినవి. ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఆగ్రా లోని తాజ్ మహల్ కంటే 26 అడుగులు ఎక్కువగా ఉంది తెలంగాణ సచివాలయం.
చార్మినార్ కంటే ఎత్తు ఎక్కువ
 ఇక హైదరాబాదులోని ఎత్తైన కట్టడం చార్మినార్ ఎత్తు 183 అడుగులు ఉంటే.. శివాలయం దానికంటే 82 అడుగులు ఎక్కువ ఎత్తు ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టసభలు లేక సచివాలయ భవనాల అన్నింటికంటే ఎత్తైన కట్టడం ఇదే. 1950లో కట్టిన కర్ణాటక విధాన సౌధ 175 అడుగుల ఎత్తు ఉంటే.. తెలంగాణ సచివాలయం 265 అడుగుల ఎత్తు ఉంది. చత్తీస్గడ్ రాజధాని నయా రాయపూర్ సెక్రటేరియట్, సెక్రటేరియట్ కంటే ఎత్తైనది తెలంగాణ సచివాలయం. ఇప్పటిదాకా ఎందుకు కొత్తగా కడుతున్న భారత పార్లమెంట్ భవనం ఎత్తు 130 అడుగులు మాత్రమే.
200 సంవత్సరాలు గ్యారెంటీ
అయితే ఈ సచివాలయాన్ని అనేక పద్ధతుల్లో నిర్మించారు. దక్కన్ వాస్తు శైలి ప్రతిబింబించేలా అధునాతన కట్టడాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్ మాదిరి ఉండకుండా లోపల విభిన్ననమైన మొక్కలు పెంచేందుకు స్థలాలను వదిలారు. అంతేకాదు భవనం లోపల కూడా మధ్యలో ఖాళీ వచ్చి అందులో గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. వర్షం చినుకు వృధా చేయకుండా ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు తవ్వారు. అధునాతన శైలిని అనుసరిస్తూనే పురాతన పద్ధతులకు పట్టం కట్టారు.. ప్రస్తుతానికైతే దేశంలో ఉన్న అత్యంత ఎత్తైన సచివాలయాల్లో తెలంగాణ సెక్రటేరియట్ మొదటి స్థానంలో ఉంది.. పైగా దక్కన్ పీఠభూమి కావడం, భూకంపాల తీవ్రత తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటువంటి సాహసానికి దిగింది. మిగతా ప్రాంతాల్లో అయితే ఇలాంటి అనువైన పరిస్థితి లేదు. అందుకే అక్కడ భూమి స్వభావం ఆధారంగా సచివాలయాలను నిర్మించారు. ఇక ఈ సచివాలయ నిర్మాణంలో అనేక అధునాతన పద్ధతులు అవలంబించడం ద్వారా 200 సంవత్సరాల వరకు భవనానికి ఏమీ కాదని నిర్మాణంలో పాలుపంచుకున్న వారు చెబుతున్నారు.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular