New Year Celebrations 2023: నూతన సంవత్సర సంబరాలకు సిద్ధమవుతున్నారు. మరో 11 రోజుల్లో వేడుకలు నిర్వహించుకునేందుకు పబ్, హోటళ్లు, రెస్టారెంట్లు, రీసార్టులు రెడీ అవుతున్నాయి. కొత్త సంవత్సరమంటే అందరికి ఎంజాయ్ మెంటే గుర్తుకు వస్తుంది. 2022కు వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వేడుకలు అంటే మందు, విందు ప్రధానంగా ఉంటాయి. యువత మత్తుగా చిత్తుగా ఊగేందుకు ప్లాన్ ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. డిసెంబర్ 31 రాత్రి మొత్తం తెల్లారే వరకు మందు తాగుతూ విందులు చేసుకుంటూ చిందులు వేయడం కామనే. దీంతో తాగిన మైకంలో ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎలా అనే దానిపై పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ సిటీ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 రాత్రి వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు పర్మిషన్ ఉంటుందని చెబుతున్నారు. దీనికి గాను పోలీసులు నిబంధనలు విధిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈవెంట్ల ఆర్గనైజర్లు, పబ్స్, హోటల్స్, రిసార్ట్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను ఆదివారం వెల్లడించారు. సంబరాలు నిర్వహించే యాజమాన్యాలు అక్కడకొచ్చే వారికి స్పష్టమైన సూచనలు చేయాలని చెబుతున్నారు.
పదిరోజులు ముందుగానే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వేడుకలు జరిగే ప్రదేశాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలు ఉండాల్సిందే. అసభ్యకర డ్యాన్సులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. డీజే సౌండ్స్ శృతి మించితే ఇబ్బందులు కలుగుతాయి. మద్యం తాగిన వారు డ్రైవింగ్ చేయకూడదు. ఈవెంట్స్ ప్రదేశాల్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలు చేపడితే యాజమాన్యాలదే బాధ్యత. అల్కహాల్ తాగి వాహనాలు నడపడం నిషేధం విధించారు.

డిసెంబర్ 31న రాత్రి సమయంలో దురుసుగా ప్రవర్తిస్తే ఊరుకోబోమని పోలీసులు తెలిపారు. తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. అంతే కాదు ఓవర్ స్పీడు, డేంజర్ డ్రైవింగ్ వంటి వాటిపై కూడా ప్రత్యేక చర్యలు ఉంటాయి. దీంతో డిసెంబర్ 31ని ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకుని ఎవరికి ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తగా మసలుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నగర పౌరులకు ఇబ్బందులు కలిగించకుండా ఎవరి పరిధిలో వారు సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.