Expensive Timber Trees : చెట్లు మనుషులుకు జీవనాధారం. ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు మనుషులు, కీటకాలు, జంతువులు, పక్షులు అన్నింటికి కూడా నీడను ఇస్తాయి. అయితే చాలా మంది వారి జీవనాధారం కోసం ప్రపంచంలోని కొన్ని చెట్లను నరుకుతుంటారు. ఉదాహరణకు చాలా మంది వుడ్ వర్క్ చేస్తుంటారు. ఇంటిని అందంగా మార్చుకోవడానికి లేదా వ్యాపారం చేసుకోవడానికి చాలా మంది చెట్లను నరుకుతుంటారు. వీటిని వ్యాపారంగా చేసుకుంటే బాగా లాభాలు వస్తాయి. అయితే ఈ ప్రపంచంలో అత్యంత ఫర్నిచర్ చెట్లు ఎక్కువగానే ఉన్నాయి. వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది. వీటిని ఉపకరణాలు, అలంకరణలు అన్నింటికి బాగా ఉపయోగిస్తారు. సహజ వనరులు అయిన చెట్ల నుంచి ఫర్నిచర్ చేసి వాటిని ఖరీదైన రేటుకి అమ్ముతుంటారు. అయితే ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన చెట్లు ఉన్నాయి. ఒక్కో కలప లక్షణం బట్టి వాటికి డిమాండ్ ఉంటుంది. చెక్కలు వాటి బలం ఆధారంగా వాటికి డిమాండ్ ఉంటుంది. ఈ రోజుల్లో కలపకు మంచి డిమాండ్ ఉంది. ఖరీదైన చెక్కలు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. చాలా మంది వీటిని అలంకరణల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కలప చెట్లు ఏవో చూద్దాం.
ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్
ఈ బ్లాక్ వుడ్ చాలా ఖరీదైనది. దీని లోతైన, రంగు ఎంతో అందంగా ఉంటుంది. ఈ కలప ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కలపలో ఇది ఒకటి. ఇది ఎక్కువగా దక్షిణ ఆఫ్రికాలో లభ్యమవుతుంది. ఇది లగ్జరీ ఫర్నిచర్. దీన్ని సంగీత వాయిద్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కలప చెక్క ఒక క్యూబిక్ మీటరుకు దాదాపు 10,000 డాలర్లు ఉంటుంది. అయితే ఈ కలప జాతి అంతరించిపోతున్న వాటిలో ఒకటి. అందుకే ఈ చెక్క ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని అరుదైన కలపగా భావిస్తారు. ఈ చెట్టు పెరగాలంటే కనీసం 60 ఏళ్లు పడుతుందట.
అగర్ కలప
ఇది ఎక్కువగా ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల అడవులలో కనిపిస్తుంది. దీని నుంచి ఎక్కువగా నూనెను తీస్తారు. ఈ కలప బంగారం కంటే ఎక్కువ విలువైనది. దీన్ని ఎక్కువగా అడవిలోని ప్రత్యేక తోటలపై తవ్వుతారు. ఆ తర్వాత దీన్ని ఎండబెట్టి అగరబత్తిల కోసం ఉపయోగిస్తారు.
నల్ల చెక్క
ఈ నల్ల చెక్క చాలా అందమైన ఆకృతిని కలిగి ఉంటుంది. దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కలప కూడా అరుదైన జాతికి చెందినది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కలప రకాల్లో ఇది కూడా ఒకటి. దీన్ని ఎబోనీ అని కూడా అంటారు. ఈ కలప భారీ జాతికి చెందినది. దీన్ని ఎక్కువగా ఫర్నీచర్‌కి ఉపయోగిస్తారు. ఇంట్లో అలంకరణలు వంటి వాటికి ఉపయోగిస్తారు.