Winter Visit Places: చలికాలంలో వాతావరణం చల్లబడుతుంది. దీంతో శరీరం వెచ్చదనం కోరుకుంటుంది. ఇదే సమయంలో చల్లటి గాలి రావడం వల్ల అనేక ఇన్ఫెక్షన్లకు గురవుతారు. అందువల్ల చలితీవ్రత తగ్గే వరకు ఎక్కడికైనా ట్రిప్ వేయాలనుకుంటారు. భారత్ లోని ఉత్తరాదిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మైనస్ డిగ్రీల్లోకి ఉష్ణోగ్రతలు ఉండడంతో ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అయితే కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఇలాంటి సమయంలో వెచ్చగా ఉంటుంది. వెచ్చదనం కోరుకునేవారు ఈ ప్రదేశాలకు వెళ్లి హాయిగా ఉండొచ్చు.
దక్షిణాదిన ఉన్నకేరళ భూభాగం మిగతా వాటికంటే ప్రత్యేకం. సముద్రపు ఒడ్డున ఉన్న కేరళలోని కోవలం బీచ్ కు వింటర్ లో వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కనీసం 25 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవి కాలంలో మాత్రం మరింత పెరుగుతుంది. చలికాలంలో ఎంజాయ్ చేయాలనుకువారు ఇక్కడికి వెళ్లొచ్చు.
గుజరాత్ లోని కచ్ ప్రాంతాన్ని ఎక్కువగా చలికాలంల సందర్శిస్తుంటారు. ఇక్కడ 27 నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఒంటెటపై స్వారీ చేస్తూ హాయింగా ఉండొచ్చు.
రాజస్థాన్ లో నిత్యం ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రాంతంలోని జైసల్మేర్ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా పేరొందింది. చలికాలంలో ఇక్కడ 12 నుంచి 25 డిగ్రీల మధ్య ఉంటుంది. సరస్సులు, జైన దేవాలయాలు ఇక్కడ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి.
కర్ణాటకలోని కూర్గ్ ను చూస్తే అక్కడి నుంచి వెళ్లబుద్ది కాదు. చలికాలంలో పచ్చని వాతావరణంతో హాయిని ఇస్తుంది. ఈ సమయంలో ఇక్కడ కాస్త వేడిగానే ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తారు.
గోవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వింటర్ లో గోవాకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. చలికాలంలో ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.