
CNG Cars: పలు అవసరాలు, పరిస్థితుల ప్రభావంతో ప్రతి ఒక్కరూ కారు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. కొన్ని మోడళ్లు తక్కువ ధరలో లభించినా ఆశించిన ఫీచర్లు లేకపోవడంతో వాటిపై ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. కానీ ఈమధ్య CNG కార్ల హవా పెరిగిపోతుంది. రోజురోజుకు వీటికి డిమాండ్ పెరగడంతో పలు కంపెనీలు వీటి ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. అంతేకాకుండా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని మార్కెట్లోకి వచ్చాయి. వీటిల్లో అతి తక్కువ బడ్జెట్ లో కారు కొనాలనుకునే వారి కోసం 5 కార్ల గురించి మీ ముందుంచుతున్నాం. వాటి వివరాలు.
టాటా టియాగో:
టాటా కంపెనీ నుంచి చాలా మోడళ్లు వచ్చాయి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే వచ్చిన ‘టియాగో’ను డీజిల్ వర్షెన్ ను నిలిపేసి సీఎన్ జీకి మార్చేసింది. ఇది 1.2 లీటర్ సీఎన్ జి ఇంజన్ ను కలిగి ఉంది. కేజీ ఇంధనానికి 26.49 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. 72 బీహెచ్పీ వద్ద 95 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాటా టియాగో XE ధర రూ.6.44 లక్షలు ఎక్స్ షో రూం ధరను నిర్ణయించారు.

వ్యాగన్ ఆర్:
మారుతీ సుజుకీ నుంచి రిలీజైన ఈ మోడల్ అత్యంత ఉత్తమమైనదిగా నిలుస్తోంది. భారతదేశంలో దీని అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యాగన్ ఆర్ 1.0 లీటర్ K సిరీస్ తో కేజీ కి 34.05 లీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది 55.92 బీహెచ్ పి వద్ద 82.1 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6.43 లక్షలు ఉంది.

ఆల్టో K 10:
ఆల్టో K 10 వాహనదారులకు ప్రియమైన కారు. దీనిని ఒక సంవత్సరం మార్కెట్లోకి తీసుకురాకపోవడంతో చాలా మంది నిరాశ చెందారు. మళ్లీ ఇప్పుడు మార్కెట్లో ఆదరాభిమానం పొందుతుంది. ఆల్టో K 10 55.92 బీహెచ్ పీ వద్ద 82.1 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్టో K 10 సీఎన్ జీ 33.85 కిలో ఇంధనాన్ని అందిస్తుంది. దీని ప్రారంభ ధర ఎక్స్ షోరూంలో రూ.5.96 లక్షలుగా ఉంది.

మారుతి S_presso:
మారుతి నుంచి రిలీజైన సీఎన్ జి కార్లలో మారుతి S_presso ప్రారంభ ధర రూ.5.90 లక్షలు ఉంది. ఇది కిలో ఇందనానికి 32.73 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 1.0 లీటర్ కె సిరీజ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 55.92 బీహెచ్ పీ వద్ద 82.1 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
మారుతి alto 800:
మారుతి నుంచి మొదటగా వచ్చిన సీన్ జీ కార్లలో మారుతి alto 800. దేశంలో అత్యంత తక్కువకు లభించే ఈ కారు కిలో ఇంధనానికి 31.59 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. ిది 40.36 బీహెచ్ పీ వద్ద 60 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారభ ధర 5.13 లక్షలుగా నిర్ణయించారు. భారతీయ మార్కెట్లలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్లలో మారుతి alto 800 ఒకటిగా నిలిచింది.
