
AP Defense Industrial Corridor: ఇన్నాళ్లు అధికార పార్టీ నేతల బెదిరింపులతో పరిశ్రమలు పారిపోయాయి. ఇప్పుడు మరొక కారణంతో ఏపీకి రాంరాం చెబుతున్నాయి. పరిశ్రమలు నడపలేని స్థితికి పరిస్థితులు దిగజారిపోయాయి. వచ్చిన పరిశ్రమలు వచ్చిన దారినే వెళ్లిపోతున్నాయి. ఏపీ అంటే హడలిపోతున్నాయి. ఇంతకీ ఏపీ నుంచి పరిశ్రమలు పారిపోవడానికి కారణమేంటి ? ఆ కథేంటో స్టోరీలో తెలుసుకుందాం.
కొత్త పరిశ్రమలు రావాలంటే.. పరిశ్రమల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. నీరు, రోడ్డు, పోర్టు, విద్యుత్ సదుపాయాలు ఉండాలి. తక్కువ ధరకే కూలీలు దొరకాలి. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉండాలి. అప్పుడే పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొస్తారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితులు లేవు. ఏపీలో కూలీ ధరలు అధికంగా ఉన్నాయి. ఇది పరిశ్రమల నిర్వహణకు భారంగా మారుతుంది. ఫలితంగా యూపీ, బీహార్ లాంటి తక్కువ కూలీ ఉన్న రాష్ట్రాలకు పరిశ్రమలు తరలిపోతున్నాయి.
ఏపీలో ఇలాంటి పరిస్థితి నెలకొనడానికి ప్రధాన కారణం.. సంక్షేమ పథకాలే. ఉచితం పేరుతో అప్పులను పప్పు బెల్లాల్లా పంచుతున్న ఏపీ ప్రభుత్వం.. ప్రజలను సోమరుల్లా మారుస్తోంది. దీంతో పనికి వెళ్లాలంటే గ్రామాల్లో ఆలోచించే పరిస్థితి ఉంది. దీని ప్రభావం పరిశ్రమల కంటే వ్యవసాయరంగం పై అధికంగా ఉంది. వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. చిన్న చిన్న పనులకు కూలీలు అసలు రావడంలేదు. దీంతో వ్యవసాయం భారమైపోయింది. పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఇదే పరిస్థితి పరిశ్రమలకు కూడా వర్తిస్తోంది. ఏపీలో కూలీ రేట్లు అధికంగా ఉండటంతో ఏపీకి రావాల్సిన డిఫెన్స్ కారిడార్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ జవాబు ఇచ్చారు. ఏపీలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసే అవకాశం లేదని కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. ఏపీలో ఉన్న కూలీ రేట్ల వల్లే పరిశ్రమలు ఏపీకి రావడానికి వెనకాడుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వ ఉచితాల వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని తెలుస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలే ఏపీ అభివృద్ధికి ఆటంకం కానున్నాయి. ఏపీలో అభివృద్ధి జరగదు. సంపద పెరగదు. ఉద్యోగాలు రావు. కేవలం అప్పులతో సంక్షేమ పథకాలు నడిపించాల్సిందే. ఈ దీనస్థితి నుంచి ఏపీని గట్టెక్కించే నాథుడెవ్వరో తెలియదు.
Also Read:Ram Charan Crush: ఆ హీరోయిన్ కి మొదటి చూపులోనే పడిపోయా… ఆమె నా క్రష్ అన్న చరణ్