
Woman Soul Comes Out Body: శరీరంలో ఆత్మ ఉందంటే ఇప్పటికి కొందరు నమ్ముతారు.. మరి కొందరు కొట్టి పారేస్తారు.. ఇప్పటికీ నిరూపితం కాలేదు కానీ సినిమాలు, కాల్పనిక సాహిత్యం వల్ల ఆత్మ ఉందని, అది మన శరీరం మృతి చెందిన తర్వాత అది వెళ్లిపోతుందని.. నిజానికి ఆత్మలు ఉంటాయా, ఉంటే అవి ఈ రూపంలో ఉంటాయి? ఎలా పయనిస్తాయి? వీటిపై అప్పట్లో నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు గాని… తర్వాత ఎందుకనో విరమించారు.. ఆ తర్వాత మిగతా ఏ దేశాలు కూడా ఆ దిశగా ప్రయోగాలు చేయలేదు..
Also Read: Ram Charan Crush: ఆ హీరోయిన్ కి మొదటి చూపులోనే పడిపోయా… ఆమె నా క్రష్ అన్న చరణ్
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల అప్లికేషన్లు రూపొందాయి..ఇంకా రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి.. అయితే వీటిల్లో వచ్చిన కొన్ని అప్లికేషన్లతో మనుషుల ఆత్మలు ఎలా చలిస్తాయో అప్పట్లో కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.. వీటిని చాలామంది కొట్టి పారేశారు. అలా ఎలా సాధ్యమవుతుందని హేళన చేశారు. తర్వాత ఇదంతా ట్రాష్ అని జన విజ్ఞాన వేదిక వాళ్ళు శాస్త్ర నిరూపణ చేశారు.

ఇది జరిగిన చాలా రోజుల తర్వాత తమిళనాడులో ఓ మహిళ అచేతనంగా పడిపోయింది.. ఆమె పడిపోవడంతోనే శరీరం నుంచి ఆత్మ అలా పైకి లేచింది.. తన దారి వెంట తను వెళ్ళిపోయింది.. అచేతనంగా పడి ఉన్న మహిళ నోరు తెరుచుకొని ఉండగా.. ఆత్మ మాత్రం నవ్వుతూ వెళ్ళిపోయింది.. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.. గాలిలో ఉండే ఆత్మ రూపం కనిపించడం ఏంటని? చాలామంది ప్రశ్నించారు.. ఇది ఎలా సాధ్యమంటూ నిలదీశారు. తర్వాత తేలింది ఏంటయ్యా అంటే ఆ ఆత్మ అనేది నిజం కాదని, ఓ అప్లికేషన్ అని తర్వాత తెలిసింది.. కానీ ఏ మాటకు ఆ మాట ఆ వీడియో చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటుకు వచ్చింది.. ఇక దాని వెనుక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే హర్రర్ సినిమాను మించిపోయింది.. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.