Illegal Affair : అన్న ఉసురు తీసిన తమ్ముడి ఎఫైర్.. హత్యకు కారణమేంటి?

Illegal Affair : ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలతో భార్య ప్రాణాలను భర్త తీస్తుండగా.. భర్త ప్రాణాలను భార్య తీయిస్తోంది. కొన్నిచోట్ల కుటుంబాలు ఈ అక్రమ సంబంధాలకు బలవుతుంటే.. మరికొన్ని చోట్ల పిల్లలు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. అటువంటి ఘటనే తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తమ్ముడి అక్రమ సంబంధానికి అన్న బలి కావాల్సి వచ్చింది. తమ్ముడు ప్రాణాలు కాపాడేందుకు రాజీ కుదుర్చుకుందామని వెళ్లిన అన్న యువతి తరపు బంధువులు వేసిన […]

Written By: BS, Updated On : April 2, 2023 6:10 pm
Follow us on

Illegal Affair : ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలతో భార్య ప్రాణాలను భర్త తీస్తుండగా.. భర్త ప్రాణాలను భార్య తీయిస్తోంది. కొన్నిచోట్ల కుటుంబాలు ఈ అక్రమ సంబంధాలకు బలవుతుంటే.. మరికొన్ని చోట్ల పిల్లలు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. అటువంటి ఘటనే తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తమ్ముడి అక్రమ సంబంధానికి అన్న బలి కావాల్సి వచ్చింది. తమ్ముడు ప్రాణాలు కాపాడేందుకు రాజీ కుదుర్చుకుందామని వెళ్లిన అన్న యువతి తరపు బంధువులు వేసిన మర్డర్ స్కెచ్ ఊహించలేక.. బతికుండగానే సజీవ సమాధి కావాల్సి వచ్చింది.

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఘటన..

ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని కేవీబీ పురం మండలం బ్రాహ్మణపల్లి లో నాగరాజు అనే వ్యక్తి శనివారం రాత్రి కారులో ఉండగానే మంటల్లో కాలి సజీవ సమాధి అయ్యాడు. ఈ ఘటనలో మృతి చెందిన నాగరాజు అతడు సోదరుడు పురుషోత్తం బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్లు గా కంపెనీలో ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో స్వగ్రామంలోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగరాజు తమ్ముడు పురుషోత్తం అదే గ్రామానికి చెందిన సర్పంచ్ చాణిక్య మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలంగా సాగుతున్న వివాహేతర సంబంధం ఈ ఏడాది శివరాత్రి రోజున బట్టబయలు అయింది. పురుషోత్తం, సర్పంచ్ మరదలు ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రత్యక్షంగా పట్టుకున్నారు. అప్పుడే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

బెంగళూరుకు పంపించిన అన్నయ్య..

ఈ క్రమంలోనే తమ్ముడు ఊర్లో ఉంటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని భావించిన నాగరాజు.. పురుషోత్తంను బెంగళూరుకి పంపించాడు. ఈ వివాహేతర సంబంధంపై ఇరువర్గాల మధ్య పంచాయతీ నడుస్తూ ఉండగానే సర్పంచ్ చాణిక్య నాగరాజుతో పాటు అతని తమ్ముడిని సైతం పంచాయతీకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అయినా నాగరాజు శనివారం తాను మాత్రమే పంచాయతీకి వెళ్ళాడు. ఒక్కడే పంచాయతీ వెళ్లడం అతనికి శాపంగా మారింది. గ్రామ సర్పంచ్ చాణిక్య నాగరాజుతో మాట్లాడాలని పిలిపించాడు. ఈ క్రమంలోనే మాటలు సందర్భంగా ఆగ్రహంతో సర్పంచ్ చాణిక్య నాగరాజుపై దాడికి దిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి అనంతరం కారులో నాగరాజు నుంచి పెట్రోల్ పోసి మీకు అంటించి ఉంటారని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటన అనంతరం సర్పంచ్ పరారీలో ఉండగా.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరణ..

తిరుపతి నుంచి స్వగ్రామమైన బ్రాహ్మణ పల్లెకు వెళుతుండగా గంగుడుపల్లి దగ్గర ఆయన కారు మంటల్లో కాలి బూడిద అయిందన్న సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నాగరాజు ఆ కారులోనే సజీవ దహనం అయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వస్తువులు కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడు నాగరాజుగా గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం సాయంతో విచారణ కొనసాగుతోంది. నాగరాజు భార్య సులోచన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్రాహ్మణపల్లికి చెందిన రూపంజయ, సర్పంచ్ చాణిక్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రూపంజయను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని, సర్పంచ్ చాణిక్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సిఐ ఓబులేసు తెలిపారు. తన భర్త నాగరాజును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని సులోచన డిమాండ్ చేసింది.

ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం..

సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో అక్రమ సంబంధం ప్రకంపనలను సృష్టించింది. తమ్ముడు చేసిన తప్పుతో అన్న ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆగ్రహంలో తీసుకున్న నిర్ణయం వలన ఒక వ్యక్తిని హత్య చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాడు సర్పంచ్ చాణిక్య. కేసు విచారణ తర్వాత తను కూడా శిక్ష అనుభవించాల్సి వుంటుంది. చిన్న తప్పటడుగు వల్ల ఇప్పుడు ఎంతో మంది శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.