Phone Shocked: ఇటీవల కాలంలో ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. ప్రతి వారి చేతుల్లో మొబైల్ ఉండటం సాధారణంగా మారింది. దీంతో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. ప్రతి ఒక్కరు ఫోన్లోనే కాలం గడుపుతున్నారు. ఎవరితో మాట్లాడటం లేదు. ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. అది పిల్లలైనా పెద్దలైనా స్మార్ట్ ఫోన్లు వచ్చాక అనుబంధాలు మారిపోతున్నాయి. మనసు విప్పి మాట్లాడుకునే అవకాశాలు రావడం లేదు. ఏదైనా మాట్లాడాలన్నా ఫోన్ లోనే తప్ప బయట మాటలు కనిపించడం లేదు. దీంతో రానురాను ఫోన్లతో మరిన్ని ఇబ్బందులు వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి.

ఫోన్లకు ఎందుకు ఇంత దగ్గరయ్యారు? అందులో ఏముంది? అంత సమయం కేటాయించాలా? అంటే స్మార్ట్ ఫోన్లోనే ప్రపంచం కనిపిస్తోంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక సమయమే తెలియదు. అందులో మనకు కావాల్సిన ఏ అంశంపైనైనా విషయం దొరుకుతుంది. దీంతో ఫోన్ వినియోగించే వారు తమకు నచ్చిన విషయంపై వీడియోలు ఎంచుకుని చూస్తుంటారు. అలా చూస్తుంటే వారికి సమయమే తెలియదు. ఎలా గడిచిపోతోందో కూడా చూసుకోరు. నేటి యువత అయితే ఫోన్ కు బాగా ఆకర్షితులయ్యారు.
అన్నం లేకున్నా ఓ రోజు బతకగలరేమో కానీ ఫోన్ లేకుంటే బతకలేరు. ఒక నిమిషం కూడా ఫోన్ ను వదిలిపెట్టడం లేదు. విద్యార్థులైనా మధ్య వయసు వారైనా వృద్ధులైనా ఫోన్లతోనే మాటలు మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో ఫోన్లు పేలిన ఘటనలు కూడా ఉన్నాయి. ఫోన్ కు చార్జింగ్ పెట్టి కూడా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇది మంచిది కాదని చెప్పినా పట్టించుకోరు. ఎలక్ర్రిక్ పరికరాల గురించి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పవర్ బ్యాంక్ కు చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్న ఓ యువతికి షాక్ కొట్టిన ఘటన చెన్నైలో జరిగింది.

హాస్టల్ లో ఉంటున్న ఓ యువతి రూంలో కిటికీ వద్ద తన ఫోన్ కు పవర్ బ్యాంక్ తో చార్జింగ్ పెట్టి ఫోన్ లో మాట్లాడుతుండగా బయట ఉన్న విద్యుత్ స్తంభం నుంచి పవర్ బ్యాంక్ కు ఎర్తింగ్ అయి విద్యుత్ షాక్ కొట్టింది. విలవిలలాడుతున్న ఆమెను కాపాడబోయిన మరో ఇద్దరు యువతులు కూడా గాయాలపాలయ్యారు. దీంతో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చార్జింగ్ పెట్టి మాట్లాడొద్దని ఎన్ని రకాలుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.