https://oktelugu.com/

Bangalore : డేటింగ్ కు రమ్మని.. ప్రియుడ్ని ఆ పని చేసిన యువతి

జూన్ 16 న ప్రారంభమైన కిడ్నాప్ స్కెచ్ 18 తేదీ వరకూ కొనసాగించారు. తరువాత విడిచిపెట్టారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రియురాలు భావ,నారెడ్డితో పాటు ఆమెకు సహకరించిన ప్రవీణ్ రెడ్డి, సుబ్రమణి, నాగేశరెడ్డి, సుధీర్, సిద్ధేశ్ లపై ఫిర్యాదుచేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Written By:
  • Dharma
  • , Updated On : June 26, 2023 / 05:28 PM IST
    Follow us on

    Bangalore : ప్రేమ పేరుతో వేధింపులు అబ్బాయిల నుంచే కాదు.. అమ్మాయిల నుంచి కూడా ఎదురవుతున్నాయి. డబ్బున్న అబ్బాయిలకు వలపు వల విసరడం, ముగ్గులోకి దించి నిలువునా దోచుకోవడం ఇటీవల ఫ్యాషనై పోయింది. అవసరాలకు, జల్సాలకు ప్రేమ అనే ట్యాగ్ లైన్ తగిలించుకోవడం, తిరిగి బ్లాక్ మెయిల్ చేసి నగదు దండుకోవడం పరిపాటిగా మారింది. మోసం చేయడంలో అబ్బాయిలకు ఏమాత్రం అమ్మాయిలు తీసిపోవడం లేదు. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ప్రేమ పేరిట దగ్గరై ..భారీ ప్రణాళికతో బురిడీ కోట్టించింది. లక్షల రూపాయలు అతడి నుంచి నిలువు దోపిడీ చేసింది.

    ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన విజయ్ సింగ్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆకర్షణీయమైన జీతంతో పాటు మంచి ఆస్తిపాస్తులున్నాయని గ్రహించిన భావనారెడ్డి ప్రేమలో పడేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో డేటింగ్ కు వెళదామని ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీంతో గురుడు అంతే స్పీడుగా లవర్ తో  చిక్ బల్లాపూర్ లోని నంది హిల్స్ సమీపంలోని రిసార్ట్స్ కు బయలుదేరాడు.ఆమె స్కెచ్ తెలియక ఓ ముఠాకు చిక్కుకున్నాడు.

    ఆమె డేటింగ్ ప్రపోజుల్ వెనుక కిడ్నాప్ ప్లాన్ రూపొందించింది. దేవనహల్లికి వెళుతుండగా ఆరుగురితో కలిసి కిడ్నాప్ చేయించింది. నంది హిల్స్ లోని క్యూవీసి విల్లాకు బాధితుడ్ని తీసుకెళ్లారు. అందరూ కలిసి దాడి చేశారు. రెండురోజుల పాటు చిత్రవధ చేశారు. అతడు అకౌంట్ లోంచి రూ.21 లక్షల నగదును తమ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. మూడు ల్యాప్ టాపులు, మూడు సెల్ ఫోన్లతో పాటు 12 గ్రాముల బంగారం గొలుసును తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు.

    జూన్ 16 న ప్రారంభమైన కిడ్నాప్ స్కెచ్ 18 తేదీ వరకూ కొనసాగించారు. తరువాత విడిచిపెట్టారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రియురాలు భావ,నారెడ్డితో పాటు ఆమెకు సహకరించిన ప్రవీణ్ రెడ్డి, సుబ్రమణి, నాగేశరెడ్డి, సుధీర్, సిద్ధేశ్ లపై ఫిర్యాదుచేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.