World Smallest Country: సారవంతమైన భూమి, నీరు, స్వచ్ఛమైన వాతావరణం ఉండే ప్రదేశంలో మానవ జీవనం మనుగడ సాగుతుంది. ఇలా కొంత మంది ఒకేచోట కలిసి జీవించడం ద్వారా ఆ ప్రదేశం ఓ ప్రాంతంగా మారుతుంది. ఆ తరువాత ప్రత్యేక దేశంగా అవతరిస్తుంది. ప్రపంచంలో 195 దేశాలున్నట్లు ఓ నివేదిక తెలుపుతుంది. ఈ క్రమంలో విస్తీర్ణంలో అత్యంత పెద్ద దేశం ఏదంటే రష్యాను పేర్కొంటాం. అతి చిన్న దేశాన్ని వాటికన్ సిటీగా చెప్పుకుంటాం. అయితే వాటికన్ సిటీ కంటే చిన్నదేశం మరొకటి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కేవలం 27 మంది మాత్రమే జీవించే ఇక్కడే దేశానికి ప్రత్యేక జెండా, కరెన్సీ ఉన్నాయి. మరి ఆ దేశం గురించి తెలుసుకుందామా..
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ నుంచి తట్టుకోవడానికి ఇంగ్లండ్ పెద్ద ఎత్తున సైన్యాన్ని తయారు చేసింది. ఈ సైన్యం కోసం 1943లో శ్రీ లాండ్ అనే ప్రాంతంలో మౌన్ సెల్ కోటలను నిర్మించింది. ఆ తరువాత 1956లో వీటిని రద్దు చేసింది. అయితే 1967లో శ్రీ లాండ్ యజమాని పేరు ప్యాడీ రాయ్ బెట్స్, పైరేట్ రేడియో బ్రాడ్కాస్టర్ ల నుంచి ఈ భూభాగాన్ని తీసుకొని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారు. ఆ తరువాత దీనికి ‘సీలాండ్ ’గా పేరు పెట్టారు. సీలాండ్ అంటే భూమి చుట్టూ సముద్రం ఉండడడం. ఇంగ్లండ్ కు 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉంటుంది.
సీలాండ్ ను అధికారికంగా ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్ అని అంటారు. ఇక్కడ కేవలం 27 మంది మాత్రమే జీవిస్తారు. 550 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశానికి సొంత జెండా, సొంత కరెన్సీ లు ఉన్నాయి. ఈ దేశాన్ని ఒక రాణి పరిపాలిస్తుంది. ప్రస్తుతం జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ దేశం అంతర్జాతీయంగా మాత్రం ఎవరూ గుర్తించలేదు. అందుకే ఈ దేశం గురించి చాలా మందికి తెలియలేదు. ఇప్పటి వరకు వాటికన్ సిటీని మాత్రమే ప్రపంచంలో అతిచిన్న దేశంగా చూశారు. కానీ అంతకంటే చిన్నదేశం ఉందని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ దేశాన్ని ఇంగ్లండ్ కు సంబంధించిన వాళ్లే ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ఆ దేశానికి సీలాండ్ వ్యతిరేకంగా పనిచేస్తోంది. ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్ వివాదాస్పద మైక్రోనేషన్. ఈ దేశ భూభాగం సపోల్క్ తీరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ దేశంలోనైనా కోట్ల కొద్దీ మనుషులు ఉంటారు. కానీ ఇక్కడ కేవలం 27 మంది మాత్రమే నివసిస్తూ వారి జీవన విధానాలను మెరుగుపరుచుకుంటున్నారు. అయితే తాజాగా ఈ దేశం గురించి బయటకు రావడంతో తీవ్ర చర్చ సాగుతోంది.