Nayanthara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై హీరోయిన్ నయనతార ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ రోజు ఆయన చేసిన పనికి షాక్ అయ్యానని వెల్లడించారు. నయనతార లేటెస్ట్ మూవీ కనెక్ట్. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కనెక్ట్ డిసెంబర్ 22న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం నయనతార హైదరాబాద్ వచ్చారు. తెలుగు మీడియాతో ఆమె ముచ్చటించారు. ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నయనతార టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ ఇలా తాను నటించిన ప్రతి హీరోపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఎన్టీఆర్ తో నయనతార అదుర్స్ మూవీ చేశారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన అదుర్స్ చిత్రంలో మోడ్రన్ గా ఉండే బ్రాహ్మణ అమ్మాయి పాత్ర చేశారు. అయితే ఈ చిత్ర సెట్స్ లో జరిగిన ఆసక్తికర విషయాలు నయనతార వెల్లడించారు.ఓ రోజు మేకప్ రూమ్ లో నేను టచప్ చేసుకుంటున్నాను. ఎన్టీఆర్ నావైపు తీక్షణంగా చూస్తున్నాడు.ఆయన నావంక అలా చూడటంతో నేను షాక్ అయ్యాను. ఎందుకు అలా చూస్తున్నారని అడిగాను?. అంత మేకప్ అవసరమా, అని ఎన్టీఆర్ సమాధానం చెప్పారని, సమాధానం వెల్లడించారు.
ఈ సందర్భంగా నయనతార ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నటన, నాట్యం కోసం తనని తాను మార్చుకున్న తీరు అద్భుతం. ఎన్టీఆర్ రిహార్సల్ చేయడం నేను చూడలేదు. డైరెక్ట్ గా చేసేసే వారని నయనతార చెప్పుకొచ్చింది. గతంలో కూడా కొందరు కొరియోగ్రాఫర్స్ ఎన్టీఆర్ ఒక్కడే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఎలాంటి స్టెప్ అయినా వేస్తారని చెప్పడం విశేషం. ఇక ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ నయనతార చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మా అన్న తోపు అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

అదుర్స్ సినిమాకు సీక్వెల్ ఉందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. దర్శకుడు వివి వినాయక్ సైతం ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ధృవీకరించారు. ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటున్న తరుణంలో కాంబినేషన్ సెట్ కావడం లేదు. ఒకవేళ ఎన్టీఆర్-వివి వినాయక్ అదుర్స్ 2 చేస్తే… నయనతారతో ఆయన మరలా జతకట్టే ఛాన్స్ రావచ్చు. మరోవైపు పెళ్లి తర్వాత కూడా నయనతార ఫుల్ బిజీగా ఉన్నారు. షారుక్ కి జంటగా నయనతార నటిస్తున్న జవాన్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. అట్లీ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు.