Homeఆంధ్రప్రదేశ్‌పెళ్లైన పది రోజులకే భర్తను వదిలేసిన భార్య.. చివరకు..?

పెళ్లైన పది రోజులకే భర్తను వదిలేసిన భార్య.. చివరకు..?

The wife who left her husband ten days after the wedding .. finally ..?

ప్రస్తుత కాలం యువత ఆలోచనా తీరు మారుతోంది. సోషల్ మీడియా ప్రభావమో, సినిమాల ప్రభావమో తెలీదు కానీ చిన్నచిన్న విషయాలకే ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు చిన్నచిన్న విషయాలకే కృంగిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుత యువత ఆలోచనా తీరుకు అద్దం పడుతోంది.

Also Read : భారీ సైజులో గ్రహశకలం… భూమికి ప్రమాదమేనా..?

చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం ఎగువమేకలవారిపల్లెకి చెందిన నాగభూషణ్ ఉన్నత చదువులు చదువుకుని హైదరాబాద్ లో ఉద్యోగం సాధించాడు. కడప జిల్లా రైల్వేకోడూరులోని వెంకటరెడ్డిపల్లెకు చెందిన సుకన్య అనే యువతి ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చింది. నాగభూషణ్ కు, సుకన్యకు తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.

అయితే ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో పెద్దలకు చెప్పినా ఫలితం ఉండదని నాగభూషణ్, సుకన్య భావించారు. పదిరోజుల క్రితం ఆలయంలో పెళ్లి చేసుకుని ప్రేమ బంధాన్ని కాస్తా వివాహ బంధంగా మార్చుకున్నారు. ఆ తర్వాత సుకన్య తల్లిదండ్రులు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో కూతురు కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగభూషణ్, సుకన్య, నాగభూషణ్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.

ఆ తర్వాత సుకన్య తాను ఇష్టపూర్వకంగానే నాగభూషణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని కావాలంటే ఆ మేరకు లిఖితపూర్వకంగా రాసి ఇస్తానని పోలీసులకు చెప్పింది. అయితే పోలీసులు మాత్రం ఆమె మాటలను పట్టించుకోలేదు. సుకన్యను బెదిరించి ఆమెను తల్లిదండ్రులతో పంపించారు. దీంతో నాగభూషణ్ సొంతూరికి వెళ్లిన తరువాత ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్థులు అతడిని కాపాడగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

Also Read : తల్లిదండ్రులను బిచ్చగాళ్లను చేసిన కొడుకు… మనిషేనా అంటున్న నెటిజన్లు..?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

1 COMMENT

Comments are closed.

Exit mobile version