కరోనా ఎఫెక్టుతో సినిమా థియేటర్లన్నీ మూడపడ్డాయి. గత ఆరునెలలుగా థియేటర్లు తెరుచుకోవడంతో ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కార్మికులు ఇబ్బదులు పడుతున్నారు. థియేటర్లు మూతపడటం ఓటీటీలకు బాగా కలిసొచ్చింది. కొత్త సినిమాలన్నీ నిర్మాతలు ఓటీటీల్లో రిలీజ్ చేస్తుండటంతో థియేటర్లో సినిమాలు చేసే ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటు పడిపోతున్నారు.
హిందీ, తమిళం, మలయాళీ సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండగా టాలీవుడ్ నిర్మాతలు మాత్రం వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. టాలీవుడ్లో భారీ బడ్జెట్లో నిర్మించిన సినిమాలకు ఓటీటీలు అంత ధర ఇస్తాయా? అనే మీమాంసలో నిర్మాతలు ఇన్నిరోజులు ఉండేవారు. అయితే ఇటీవల దిల్ రాజు నిర్మించిన ‘వి’ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.32కోట్ల ఆఫర్ ఇచ్చిందట. దీంతో ఈ మూవీకి ఇతర హక్కులను కలుపుకొని రూ.10కోట్ల మేర ఆదాయం వచ్చిందనే టాక్ విన్పిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ మంచి ధర ఇచ్చిన కొనుగోలు చేసి ఓటీటీలో ప్రసారం చేసింది. అయితే ‘వి’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను నిరాశపర్చింది. ‘వి’తో అమెజాన్ ప్రైమ్ కు భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద సినిమాల విషయంలో అమెజాన్ ప్రైమ్ ఆచితూచి డీల్ సెట్ చేస్తోంది. ‘వి’ చిత్రానికి ముందు ‘నిశబ్దం’ మూవీకి అమెజాన్ ప్రైమ్ 30కోట్ల ఆఫర్ ఇచ్చిందట. అయితే ‘వి’ ప్లాప్ తర్వాత అమెజాన్ ప్రైమ్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘నిశబ్దం’ మూవీకి రూ.24కోట్లే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అంటే రూ.6కోట్ల డెఫిషిట్ తో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారట.
‘నిశబ్దం’ సినిమా టాక్ ను బట్టి శాటిలైట్.. డబ్బింగ్, ఇతర హక్కులతో ఆ లోటును పూడ్చుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ‘వి’ తర్వాత టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ‘నిశబ్ధం’. ఈ మూవీ టాక్ ఆధారంగానే రానున్న సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక త్వరలోనే సాయిధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సోబెటర్’.. ‘గుడ్ లక్ సఖి’.. ‘మిస్ ఇండియా’.. మూవీలు ఓటీటీలో వచ్చేందుకు రెడీగా ఉన్నాయి.
‘వి’ ప్రభావం ‘నిశబ్దం’పై ఏవిధంగా పడిందో.. అదేవిధంగా ఈ సినిమా ప్రభావం కూడా రానున్న చిత్రాలపై పడనుంది. దీంతో ‘నిశబ్దం’ మూవీకి ఓటీటీలో మంచి టాక్ రావాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం అనుష్క అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.