https://oktelugu.com/

Beer : బీర్‌ పొంగలేదని విక్రయదారు ఆందోళన.. అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న మందుబాబులు!

మందు బాబులు ఎక్కువగా ఇష్టపడే మద్యంలో బీర్‌ ఒకటి. వేసవి వచ్చిందంటే ఎక్కువగా బీర్లు అమ్ముతారు. విస్కీ, బ్రాందీ తాగే అలవాటు లేనివారు కాలంలో పనిలేకుండీ బీర్లు తాగుతారు. బీర్‌ ఓపెన్‌ చేయగానే గ్యాస్‌తో నురగ వస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 3, 2024 / 12:16 AM IST

    Beer

    Follow us on

    Beer :  బ్రాందీ, విస్కీ తాగే అలవాటు లేనివారు.. బీర్లు తాగుతుంటారు. బీర్లు తాగే అలవాటు ఉన్నవారు వాటి క్వాలిటీని గుర్తిస్తారు. నాసిరకం బీర్లు విక్రయిస్తే ఆందోలన చేస్తారు. కొన్నిసార్లు బీరు సీసాల్లో వ్యర్థాలు రావడం కూడా చూస్తుంటాం. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో బీరు పొంగడం లేదని, నురగ రావడం లేదని ఆందోళన చేశాడు. సాధారణంగా బీరు ప్రియులు దానిని ఓపెన్‌ చేయగానే బుస్సుమని పొంగాలని భావిస్తారు. అలా అయితేనే బీరు రుచిగా, స్ట్రాంగా ఉందని భావిస్తారు. కానీ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపులలోని ఓ మద్యం షాపులో విక్రయించిన బీరు నురగ రాలేదు. దీంతో కొనుగోలు చేసిన వ్యక్తి వచ్చి దుకాణం ఎదుట ఆందోళన చేశాడు. దీంతో అక్కడే ఉన్న మందు బాబులు కూఆ ఆయనకు జత కలిశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మద్యం షాపుల్లో నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు చేసి నాణ్యమైన మద్యం అమ్మేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

    నురగకు కారణం..
    బీరు నురగ వస్తేనే నాణ్యమైనదని భావిస్తారు. మందు బాబులకు కూడా బీర్‌ తాగిన అనుబవం అందిస్తుంది. కొందరు చిల్డ్‌ బీర్‌లో నురగ రావడాన్ని ఇష్టపడతారు. తాగినప్పుడు నురగ పెదాలకు అంటుకోవడాన్ని ఆస్వాదిస్తారు. బీరులో నురగ లేకపోతే సీవో2 కరిగిపోతుంది. రుచిగా అనిపించదు.

    అందుకే టిన్స్‌…
    సీసాలో సీవో2 లీకేజీ సమస్య పరిష్కరిచండానికి టిన్స్‌ రూపంలో బీర్‌ వస్తుంది. దీనిని మొదట జపాన్‌ కంపెనీ రూపొందించింది. ఇది నురగను నియంత్రిస్తుంది. దీంతో బీఆర్‌ తాగేవారు పూర్తిగా నురగను ఆస్వాదిస్తారు. అయితే మన దగ్గర మాత్రం టిన్‌ ధర ఎక్కువగా ఉండడంతో చాలా మంది సీసాలనే వాడుతున్నారు. ఎక్కువ సేపు ఓపెన్‌ చేసి ఉండడం, లీకేజీ కారణంగా నురగ తగ్గిపోతుంది.