Months:సాధారణంగా ఏడాదికి 12 నెలలు ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. తెలుగు వాళ్లమైన కూడా ఈ ఇంగ్లీషు నెలలనే వాడుతుంటారు. అయితే సంవత్సరానికి మొత్తం 12 నెలలు ఉన్నా.. వీటికి పేర్ల ఎలా వచ్చాయో కూడా తెలియదు. అయితే గతంలో సంవత్సరానికి కేవలం 304 రోజులు మాత్రమే ఉండేవి. అప్పుడు పది నెలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత క్యాలెండర్‌ను తీర్చిదిద్దడంతో మొత్తం 12 నెలలు వచ్చాయి. ఇలా ఒక్కో నెలకి ఒక్కో పేరు వచ్చింది. అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఒక్కో నెలకు ఒక్కో స్టోరీ ఉంది. మరి అవేంటో పూర్తిగా తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
జనవరి
ఒక్కో నెల పేరుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. జనవరి నెలని జావన్ అనే ఒక రోమన్ దేవునికి అంకితం చేశారు. ఈ దేవుడికి రెండు తలలు ఉంటాయి. ఒకటి వెనక్కి చూస్తే ఇంకోటి ముందుకు చూస్తుంది. అందుకే గడిచిన సంవత్సరం, వస్తున్న సంవత్సరం అని ఉద్దేశించి ఏడాది ప్రారంభానికి జనవరి అని పేరు పెట్టారు. జావన్ అనే దేవుడు వల్ల ఈ పేరు వచ్చింది.
ఫిబ్రవరి
ఈ నెల పెట్టడానికి ఓ ప్రత్యేకత ఉంది. పాపాల నుంచి ప్రక్షాళన చేయడం. అంటే రోమన్‌లో సెలవు కావడం వల్ల ఫిబ్రవరిగా పెట్టారు.
మార్చి
ఈ నెలను ఎక్కువగా బలమైన నెలగా భావిస్తారు. రోమన్లు యుద్ధ దేవుడు అయిన మార్స్ పేరును మార్చిగా పెట్టారు. ఈ పేరు వల్ల బలం వరిస్తుందని నమ్ముతారు.
ఏప్రిల్
నాలుగో నెలగా ఏప్రిల్ పెట్టడానికి గ్రీకు దేవత ఆఫ్రొడైట్ అఫ్రిలిస్ కారణం. ఈమె గౌరవార్థంగా వసంత నెల అయిన నాలుగో నెలకు ఏప్రిల్ అని పేరు పెట్టారు.
మే
వసంత కాలానికి గ్రీకు సంతానోత్పత్తి దేవత అయిన మాయ పేరును పెట్టారు. వసంత కాలానికి ఈ నెల చివరిగా భావిస్తూ మే అని పెట్టారు.
జూన్
జూన్‌ను వేసవి విహారంగా భావిస్తారు. ఈ క్రమంలో రోమన్ దేవత అయిన జూనో – జూనో పేరునే జూన్‌గా పెట్టారు.
జూలై
గొప్ప కమాండర్, రాజకీయ నాయుడు అయిన జూలియస్ సీజర్ అనే వ్యక్తి ఈ నెలలో జన్మించారు. ఆ కారణంగా తనకి గుర్తుగా జూలై అని పెట్టారు. అయితే దీనికి ముందుగా క్వింటిలిస్ అనే పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత దాన్ని జులైగా మార్చారు.
ఆగష్టు
రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆక్టేవియన్ అగస్టస్ పేరు మీదుగా ఆగస్టు అని పెట్టారు. ఇతను రోమన్ రాజకీయ నాయకుడు కూడా.
సెప్టెంబర్
సెప్టెం అనే లాటిన్ పదం నుంచి సెప్టెంబర్ పేరు వచ్చింది.
అక్టోబరు
ఆక్టో అనే లాటిన్ పదం నుంచి అక్టోబరు వచ్చింది. దీన్ని రోమన్ క్యాలెండర్‌లో ఎనిమిదో నెలగా గుర్తించారు. కానీ ప్రస్తుత క్యాలెండర్‌లో అయితే పదో నెల.
నవంబర్
నవమ్ అనే లాటిన్ పదం నుంచి నవంబర్ వచ్చింది. రోమన్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెలగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు 11వ నెలగా ఉంటుంది. అలాగే జేన్ ఆస్టెన్ అనే వ్యక్తి మరణం తర్వాత స్థానాన్ని మార్చారని చెబుతుంటారు.
డిసెంబర్
డెసెమ్ అనే లాటిన్ పదం నుంచి డిసెంబర్ వచ్చింది. ఈ పదాలను 18వ శతాబ్దపు రచయిత లారెన్స్ స్టెర్న్ మొదటిసారి ఉపయోగించారు.