Tiger Afraid Elephants: “టైం బ్యాడ్ అయితే.. జేబులో ఉన్న పెన్ను కూడా వెపన్ అవుతుంది” అని ఓ వెస్ట్రన్ సామెత ఉంది.. సరిగ్గా ఇక్కడ కూడా అడవికి రాజు అయిన పులి పరిస్థితి కూడా అలానే మారింది. భయంతో పొదల చాటున దాకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఓ చిరు ప్రాణి నక్కినక్కి ప్రాణాలు కాపాడుకున్నట్టు.. తన ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. భయం భయంగా ఆ కొద్ది నిమిషాలు బతకాల్సి వచ్చింది.
పులి తలవంచింది
సాధారణంగా పులి గంభీరమైన అడుగులు వేస్తుంది. రాజసమైన నడకతో నడుచుకుంటూ వెళ్తుంది. కానీ ఏ జంతువు ముందు కూడా తలవంచదు. అడ్డంగా వస్తే ఎదురుదాడి చేస్తుంది. పంజా దెబ్బతో ప్రాణాలు తీస్తుంది. చూస్తుండగానే చంపి తినేస్తుంది. అలాంటి పులి గజరాజులను భయపడింది. అంతేకాదు ముందు మీరు వెళ్ళండి అంటూ ప్రోటోకాల్ పాటించింది. పైగా ఒక పొదలో గజరాజులకు కనిపించకుండా నక్కి నక్కి దాక్కుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
దారి ఇచ్చి మరీ
వీడియోలో ఒక దట్టమైన అడవి కనిపిస్తుంది. ఒక పులి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక ఏనుగుల గుంపు అటుగా వస్తుంది. దీంతో పులి వాటికి కనిపించకుండా దూరంగా కూర్చుంటుంది. పులి పొదల మాటున కూర్చోవడంతో ఆ ఏనుగులకు కనిపించదు..ఆ ఏనుగులు ఒక్కొక్కటిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతలో పులి నెమ్మదిగా లేచి ఆ ఏనుగులు వెళుతున్న దారివైపు వరకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి తన దారిన వెళ్లి ఎందుకు ప్రయత్నిస్తుంది. సరిగా ఇంకొక ఏనుగు దానికి ఎదురుపడటంతో ఒక్కసారిగా పులి భయంతో తత్తర పడిపోతుంది. దీంతో దానికి దారి ఇచ్చి మరీ వేగంగా వెళ్ళిపోతుంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్
దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు..” పులి అడవికి రాజు కావచ్చు.. కానీ ఏనుగులకు దారి ఇచ్చింది” అనే క్యాప్షన్ జోడించారు. జంతువులు కూడా ఈ విధమైన సామరస్యాన్ని పాటిస్తాయి కాబోలు అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ వీడియోను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ విజేత సింహ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే అన్ని జంతువులను వేటాడే పులులు ఏనుగుల విషయంలో వెనుకంజ వేస్తాయని అటవీశాఖ నిపుణులు చెబుతున్నారు. అరుదైన సందర్భంగా మాత్రమే అవి ఏనుగులను వేటాడుతాయని వివరిస్తున్నారు.
This is how animals communicate & maintain harmony…
Elephant trumpets on smelling the tiger. The king gives way to the titan herd
Courtesy: Vijetha Simha pic.twitter.com/PvOcKLbIud— Susanta Nanda (@susantananda3) April 30, 2023