Adipurush Trailer Release Date: ‘ఆదిపురుష్’ ట్రైలర్ గురించి ఫ్యాన్స్ కి అదిరిపొయ్యే వార్త

వచ్చే నెల సినిమా విడుదల అవుతున్న సందర్భంగా ప్రొమోషన్స్ ని కూడా త్వరలోనే ప్రారంభించబోతుంది మూవీ టీం.ఈలోపు ట్రైలర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉంది,ఈ నెల రెండవ వారం లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట.

Written By: Vicky, Updated On : May 1, 2023 4:32 pm
Follow us on

Adipurush Trailer Release Date: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆది పురుష్’ చిత్రం వచ్చే నెల 16 వ తేదీన తెలుగు , హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. రామాయణం ని సరికొత్త మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా టీజర్, టీజర్ విడుదల సమయం లో గ్రాఫిక్స్ దరిద్రంగా ఉంది అని అభిమానుల నుండి ఫీడ్ బ్యాక్ రావడం తో చిత్రాన్ని జూన్ 16 వ తేదికి వాయిదా వేశారు. ఇప్పుడు గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయ్యిందని,ఆడియన్స్ కి పూనకాలు వచ్చే రేంజ్ లో ఈ చిత్రం ఉండబోతుందని మూవీ యూనిట్ చెప్తుంది.

వచ్చే నెల సినిమా విడుదల అవుతున్న సందర్భంగా ప్రొమోషన్స్ ని కూడా త్వరలోనే ప్రారంభించబోతుంది మూవీ టీం.ఈలోపు ట్రైలర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉంది,ఈ నెల రెండవ వారం లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట. ఈ ట్రైలర్ కేవలం ఇంటర్నెట్ లో మాత్రమే కాదు, థియేటర్స్ లో కూడా ప్రత్యేకంగా విడుదల కాబోతుంది.

ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో టీజర్ ని చూసినప్పుడు కలిగిన నెగటివ్ ఫీలింగ్ మొత్తం పోతుందని, కచ్చితంగా అభిమానులు గర్వపడే రేంజ్ లోనే ఈ సినిమా ఉంటుందని చెప్తున్నారు. రీసెంట్ గానే విడుదల చేసిన ‘జై శ్రీరామ్’ లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే విధమైన రెస్పాన్స్ ట్రైలర్ కి వస్తుందో లేదో చూడాలి.