China: కథలన్నీ కల్పితాలు కావు. మన నిజ జీవితంలో జరిగిన సంఘటనలే కథలుగా రూపాంతరం చెందుతాయి. చిన్నప్పుడు మనం చదువుకున్న అనగనగా ఒక రాజు.. ఆయనకు ఏడుగురు భార్యలు.. ఇటువంటి వాటికి వాస్తవరూపం ఎక్కడో ఒకచోట ఉంటుంది కాబట్టే.. నేటి డిజిటల్ కాలంలోనూ జనాల నోళ్లల్లో నానుతోంది.. ఇంగ్లీష్ మీడియం చదువులోనూ ఇంట్లో పెద్దోళ్ళు పిల్లలకు అలాంటి కథలే చెబుతుంటారు.. పైగా పిల్లలు కోరుకునే ఎలిమెంట్స్ మొత్తం ఆ కథలో ఉంటాయి కాబట్టే.. పెద్దవాళ్లు చెబుతుంటే చాలా ఆసక్తికరంగా వింటుంటారు. వాస్తవానికి పురాణ కథల్లో అనగనగా ఒక రాజు ఆయనకు ఏడుగురు భార్యలు.. లేదా 10 మంది భార్యల వంటి ఉపోద్ఘాతాలను చదివే ఉంటాం.. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథ పూర్తి డిఫరెంట్..
క్రీస్తుశకం 464లో చైనాను లియో సాంగ్ అనే రాజ వంశానికి చెందిన జియా వోవ్ అని ఓ చక్రవర్తి పాలిస్తుండేవాడు. ఆయనకు షాన్యన్ కుయిజీ అనే పేరుతో ఓ అందమైన కుమార్తె ఉండేది. కుమార్తెతోపాటు లియు జియే అనే ఒక కుమారుడు ఉండేవాడు. షాన్యన్ కుయిజీ ని కుయిజీ అని ముద్దుగా పిలుస్తారు. కుయిజి యుక్త వయసుకు రావడంతో ఆమె తండ్రి జియావోవు యువరాణిగా ప్రకటించాడు.. అనంతరం దక్షిణ క్వి రాజ వంశానికి చెందిన రాజు హీ యాన్ కుమారుడు హీజీ కి ఇచ్చి వివాహం చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జియో వోవు చక్రవర్తి అనారోగ్యంతో మరణించాడు. దీంతో అతడి తర్వాత లియు జియే చక్రవర్తి అయ్యాడు.
జియో వోవు తో పోలిస్తే లియు జియే పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్. పరిపాలనను గాలికి వదిలేసి విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. అతడికి తక్కువ వయసే ఉన్నప్పటికీ రోజుకో అమ్మాయితో గడిపేవాడు. అది అతడి సోదరి కుయిజి చూసేది. తన తమ్ముడి వ్యవహార శైలి చూసి అసూయపడేది.. దీంతో తన తమ్ముడితో ఒకరోజు గొడవ పడింది..”నువ్వు అంత మందితో గడుపుతుంటావు. నాకు మాత్రం ఒక్కడే భర్త. ఇది సరైనది కాదు అంటూ”తన తమ్ముడిని నిలదీసింది. దీంతో అతడు కొంతమందిని ఆమెకు చూపించాడు. “నీకు నచ్చిన వారిని ఎంచుకొని, సుఖాన్ని అనుభవించంటూ” చెప్పాడు. దీంతో ఆమె 30 మందిని ఎంచుకొని వారితో శారీరక సుఖాన్ని అనుభవించింది.
అప్పటికీ ఆమె కోరిక తీరక.. తన ఆస్థానంలో ఉన్న చు యువాన్ అనే అధికారిపై మనసు పడింది. అతనితో శారీరక సుఖం అనుభవించాలని కోరుకుంది. కానీ, దానికి అతడు ఒప్పుకోలేదు. అతడిని ఎలాగైనా వశపరచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, అవేవీ ఫలప్రదం కాలేదు. ఈలోగా కుయిజి తమ్ముడు లియో సాంగ్ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత కుయిజిని భర్త వదిలిపెట్టాడు. రాజ్యాన్ని పొరుగు రాజులు ఆక్రమించారు. దీంతో ఆమె తీవ్రంగా ఇబ్బందులు పడింది. అనంతరం అనారోగ్యం బారిన పడి కన్ను మూసింది. మనసులో కోరిక అనేది తారాస్థాయికి చేరితే, దాని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. అయితే ఈ చైనీస్ జానపదాన్ని అక్కడ విశేషంగా చెప్పుకుంటారట. డ్రాగన్ దేశంలో ఇలాంటి జానపద కథలు చాలానే వ్యాప్తిలో ఉన్నాయట. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి కథలు వెలుగులోకి వస్తున్నాయి.