https://oktelugu.com/

Lavanya Tripathi: పెళ్లైన ఏడాది లోపే గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి… సోషల్ మీడియా పోస్ట్ వైరల్

లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ మూవీ లావణ్య త్రిపాఠికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 21, 2024 / 02:15 PM IST

    Lavanya Tripathi

    Follow us on

    Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలిగా వెళ్ళింది. గత ఏడాది వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా మూడు రోజులు వివాహ వేడుకలు జరిగాయి. మెగా హీరోలందరూ ఈ పెళ్ళికి హాజరయ్యారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలది ప్రేమ వివాహం. మిస్టర్ మూవీ లో జంటగా నటించిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం అంతరిక్షం టైటిల్ తో మరొక చిత్రం చేశారు. చాలా కాలం వీరి ప్రేమ వ్యవహారం రహస్యంగా నడిచింది. గత మూడేళ్ళుగా పుకార్లు మొదలయ్యాయి.

    అయినప్పటికీ ఈ జంట ఖండించడం విశేషం. సడన్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. 2023 నవంబర్ లో వరుణ్ తేజ్-లావణ్యల వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత మొదటిసారి గుడ్ న్యూస్ షేర్ చేసింది లావణ్య. గ్లామరస్ ఫోటోలు షేర్ చేసిన ఆమె ఆసక్తికర కామెంట్ జోడించింది. లావణ్య సదరు పోస్ట్ లో… అమ్మకు చెందిన ఆభరణాన్ని నేను ధరించారు. నేను కోరుకుంటున్న రోజు నేడు వచ్చింది.. అని ఆమె కామెంట్ పెట్టారు.

    లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ మూవీ లావణ్య త్రిపాఠికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అనంతరం సోగ్గాడే చిన్ని నాయనా, భలే భలే మగాడివోయ్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అయితే ఈ మధ్య ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. దాంతో రేసులో వెనుకబడింది.

    లావణ్య త్రిపాఠి వివాహం అనంతరం కూడా నటన కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ విడుదల అయ్యింది. బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ అందులో హీరోగా నటించాడు. లావణ్య తనకు నచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. మరోవైపు వరుణ్ స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయనకు ఎఫ్ 2 తర్వాత హిట్ లేదు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వరుసగా పరాజయం పాలయ్యాయి. బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.