Star Hero Assets: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఫీటు జాగా కూడా ఎంతో ఖరీదు. దానికే లక్షలు పలుకుతాయి. ఒక ఫ్లాట్ స్థలం కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. మరీ ముంబై నడిబొడ్డున ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది. వందల కోట్ల విలువ చేస్తుంది.. ముంబై-శాంటాక్రూజ్ వెస్ట్లో మన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు 27650 చదరపు అడుగుల ఖరీదైన స్థలం ఉంది. ఇప్పుడు దానికి కేవలం అద్దె రూపంలోనే కోట్లు వచ్చిపడుతున్నాయి.

ముంబైలోని ఖరీదైన ఏరియాల్లో సల్మాన్ ఖాన్ సహా పలువురు స్టార్లు సినిమాల్లో మొదట్లో బాగా సంపాదించిన సొమ్ముతో స్థలాలు కొన్నారు. ఇప్పుడవి ముంబైలో కీలక వాణిజ్యప్రాంతాలు అయిపోయారు. సల్మాన్ తోపాటు పలువురు స్టార్ హీరోలకు ఇక్కడ స్థలాలున్నాయి. వీటికి అద్దెల రూపంలోనే నెలకు కోటి వరకూ వస్తోంది. ముందస్తు అడ్వాన్సుల కింద రెండున్నర కోట్లు చెల్లిస్తున్నారట..
సల్మాన్ స్థలాన్ని ఫ్యూజర్ గ్రూపునకు చెందిన టీఎన్ఎస్ఐ రీటైల్ గ్రూప్ లీజుకు తీసుకుంది. ఇందుకు గాను ఏకంగా డిపాజిట్ కింద రూ.2.68 కోట్లు సల్మాన్ కు చెల్లించిందట.. ఇక లీజు కింద నెలకు దాదాపు రూ. 89.6 లక్షలు మొదటి ఏడాది చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రెండో ఏడాది రూ.94.08 లక్షలు పెంచుతారట..
ఇలా సినిమాల్లో సంపాదించిన సొమ్మును అంతా రియల్ ఎస్టేట్ పై పెట్టి బాలీవుడ్ స్టార్లు నెలనెలా భారీగా ఆర్జిస్తున్నారు. అద్దెల రూపంలోనే ఏకంగా కోట్లు దండుకుంటున్న పరిస్థితి నెలకొంది.