Brahmastra Nagarjuna : కింగ్ నాగార్జున సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా చరిత్రలో నిలిచారు. తాజాగా నాగార్జున నటించిన ‘బ్రహ్మస్త్ర’ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైంది. తెలుగుతోపాటు దక్షిణాది భాషలు, హిందీలో పాజిటివ్ టాక్ తో ముందుకెళుతోంది. ఈ సినిమా బ్రహ్మస్త్రలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. తెలుగు సినిమా పరిశ్రమలో హిందీలో ఎక్కువ సినిమాల్లో హీరోగా నటించిన ఆ రికార్డు కేవలం నాగార్జునకే ఉంది. ఆయన దరిదాపుల్లో ఏ హీరో లేరు.

సౌత్ నుంచి బాలీవుడ్ లో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోగా నాగార్జున నిలిచారు. ఆయన కంటే ముందు రజినీ, కమల్ హాసన్ ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ హిందీ చిత్రాల్లో యాక్ట్ చేసిన హీరోగా నాగార్జున రికార్డులకు ఎక్కారు.
నాగార్జున బాలీవుడ్ లో నటించిన చిత్రాల విషయానికి వస్తే.. తెలుగులో వచ్చిన ‘శివ’ చిత్రంతో హిందీలోకి కూడా అడుగుపెట్టాడు నాగార్జున. రాంగోపాల్ వర్మ ఇదే ఆర్టిస్టులతో హిందీలో రిమేక్ చేశాడు. ఈ చిత్రం బాలీవుడ్ లోనూ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఖుదా గవా అనే హిందీ చిత్రంలో నటించారు. ఇందులో అమితాబ్, శ్రీదేవి జోడీగా నటించారు.ఈ చిత్రం హిందీలో హిట్ అయ్యింది.
ఇక తెలుగులో వచ్చిన ‘అంతం’ సినిమాను హిందీలో ద్రోహీ పేరుతో రాంగోపాల్ వర్మ తీశాడు. మహేశ్ భట్ దర్శకత్వంలో రూపొందిన ‘క్రిమినల్’ తెలుగులో యావరేజ్ గా ఆడినా హిందీలో మాత్రం బంపర్ హిట్ కొట్టింది.
ఇక మిస్టర్ బేచారా పేరుతో నాగార్జున, అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన ఈ సినిమా హిట్ అయ్యింది. ఇక అంగారే సినిమాలోనూ అక్షయ్ కుమార్ తో కలిసి నాగార్జున నటించారు. మహేష్ భట్ దర్వకత్వంలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన జక్మ్ చిత్రంలోనూ హీరో తండ్రి పాత్రలో నాగార్జున నటించారు.
ఇక అగ్నివర్ష అనే హిందీ సినిమాలో ముఖ్యపాత్రలో నటించాడు నాగార్జున‘బార్డర్’ అనే హిందీ సినిమాలోనూ నాగార్జున మేజర్ పాత్ర పోషించారు. తాజాగా ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో మరోసారి కీలక పాత్రలో నటించారు.
ఇలా ఏ హీరో కూడా ఇన్ని హిందీ చిత్రాల్లో నటించలేదు. దక్షిణాది నుంచి నాగార్జునకే ఆ క్రెడిట్ దక్కింది.