Bigg Boss 6 Telugu Elimination: బిగ్ బాస్ జోరుగా సాగుతోంది. అలకలు, కొట్లాటలు, గొడవలతో రంజుగా జరుగుతోంది. బిగ్ బాస్ లో మొన్న నామినేషన్స్ సందర్భంగా మొదలైన రచ్చ నిన్న కూడా కంటిన్యూ అయ్యింది. తొలి వారం నామినేషన్స్ లో ఏకంగా ఏడుగురు నామినేట్ అయ్యింది. తొలి వారం నామినేషన్స్ లో రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనాయా, అభినయశ్రీ, ఆరోహి లు ఉన్నారు. ఈ ఏడుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావడం గ్యారెంటీ. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది వేచిచూడాలి.

బిగ్ బాస్ తొలి వారం జోరుగా ఓట్లు పడుతున్నాయి. ఆరంభం నుంచి టాప్ ప్లేస్ కోసం ముఖ్యంగా ఇద్దరు పోటీపడుతున్నారు. అందులో రేవంత్, ఫైమాకు హోరాహోరీగా ఓట్లు పడుతున్నాయి. ప్రస్తుతానికి రేవంత్ ముందున్నా.. అతడి వెనుకాలే ఫైమా ఉంది. శుక్రవారం వరకూ ఈ ఓటింగ్ తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎంటర్ టైన్ మెంట్ పంచుతున్న ఫైమాకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. హౌస్ లో ఇగో ఫీలింగ్ తో అందరితో గొడవలు పెట్టుకుంటున్న సింగర్ రేవంత్ కు సెలబ్రెటీలు, బయట ఫాలోయింగ్ ఉండడంతో ఓట్లు బాగానే పడుతున్నాయి. సామాన్యులు, టీవీ వీక్షకుల్లో మాత్రం ఫైమాకు బాగా ఓట్లు పడుతున్నాయి. అసలు ఫైమా టాప్ లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఇక మూడో స్తానంలో శ్రీసత్య, నాలుగో ప్లేసులో చలాకీ చంటి, 5వ స్థానంలో ఆరోహీ రావు, 6వ స్థానంలో అభినయశ్రీ ఉన్నారు.
చిట్టచివరన ఇనియా సుల్తానా ఉంది. అయితే ఇనాయాకు , అభినయశ్రీకి ఓట్లే తేడా చాలా స్వల్పంగా ఉంది. దీంతో ఈ వారం బిగ్ బాస్ నుంచి అయితే ఇనాయా లేదా అభినయశ్రీల్లో ఒక్కరు ఎలిమినేట్ కావడం గ్యారెంటీగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇనాయా వెనుకబడి ఉంది.
