Sky Glows In Pink Over Australian: చదువు రాకముందు కాకరకాయ అన్నాడట. కానీ చదువుకున్నాక కీకరకాయ అని చెప్పాడని సామెత. శాస్త్ర సాంకేతిక ఎంతగా పెరిగినా మనిషిలోని తెలివితక్కువ తనం మాత్రం పోవడం లేదు. చంద్రుడిపై అడుగుడినా మనిషిలో మేధస్సు పెరగడం లేదు. ఆలోచన విధానం మారడం లేదు. ఇంకా పూర్వకాలంలో వలే ప్రవర్తిస్తున్నారు. ఇందుకు తాజా సంఘటన ఆస్ర్టేలియాలో చోటుచేసుకుంది. ఆకాశం గులాబీ వర్ణంలోకి మారడంతో కలియుగాంతం వచ్చేసింది. ఇష్టమైన ఆహారాలు తిని తమ బందువులకు ఫోన్లు చేసి మాట్లాడుకున్నారట. ఇంత శాస్త్రీయత పెరిగినా మూర్ఖత్వం మాత్రం మారడం లేదు.
ఇరవయ్యో శతాబ్ధంలో ఉన్నా మనిషిలో మూఢత్వం పోవడం లేదు. ఆకాశం గులాబీవర్ణంలోకి మారితే యుగాంతం వచ్చేసినట్లేనా. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవా? శాస్త్రవేత్తలు తెలియజేయరా? కలియుగాంతం వస్తే ముందస్తు హెచ్చరికలు ఉండవా? ఇవేమీ పట్టించుకోకుండా ఏదో జరిగిందని ప్రజలు భయాందోళనలో బతకడం విడ్డూరమే. ప్రామాణికతకు పట్టింపేది? ఉన్నపళంగా ఊరికేదో అయిందని గగ్గోలు పెడుతూ ఇక తాము చనిపోతామని భ్రమ పడటం భావ్యమేనా? మనిషిలో ఇంత అమాయకత్వమా? ఇంత దారుణమైన ఆలోచనలు రావడం నిజంగా దురదృష్టమే.
Also Read: Rashmika Mandanna- Venu Swamy: రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక
ఆస్ర్ట్టేలియాలోని మిల్డురా పట్టణంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.ఇక్కడ ప్రభుత్వమే రహస్యంగా గంజాయి పెంచుతుంది. దానికి మార్కెట్ కూడా తనే చూసుకుంటుంది. అయితే ఇదంతా రహస్యంగా చేస్తుంది. ఎంత గోప్యత అంటే చుట్టుపక్కల ఉన్నవారికి కూడా అక్కడ గంజాయి సాగుచేస్తారనే విషయం తెలియదు. అంతలా రహస్యంగా ఉంచుతారు. గంజాయి పెంపకంలో భాగంగా అక్కడ గులాబీ రంగు విద్యుత్ దీపాలు అమర్చుతారు. రాత్రి పూట లైట్లు వేసి ఉంచుతారు. ఆ వెలుగు బయటకు కనిపించకుండా ఉండేందుకు మొక్కల ఎన్ క్లోజర్లకు తెల్లటి చారలు కప్పుతారు.
అయితే ఆ రోజు తెల్లటి చారలు కప్పే క్రమంలో లైట్లు పనిచేయలేదు. మిల్డురాలో ఉన్న తోటల్లో ఓ సాంకేతిక లోపం ఏర్పడింది. తెల్ల చారలను కప్పే వ్యవస్థ మొరాయించింది. దీంతో గులాబీ వర్ణంలో ఆకాశం మారిపోయింది. దీంతో అక్కడున్న వారందరు ఇక అంతా అయిపోయింది. కలియుగం అంతం కాబోతోందనే వాదన బలంగా వ్యాపించింది. దీంతో అక్కడున్న వారందరు తమకు ఉన్న వాటిని ఇష్టంగా తిని బందువులతో ఫోన్లో కాలక్షేపం చేశారు. ఇక మేమంతా చనిపోతున్నామని విచారం వ్యక్తం చేస్తూ సందడి చేశారు.
దీంతో ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇంత మూర్ఖత్వమా? మనిషి అంధవిశ్వాసానికి అన్ని రకాలుగా అక్షింతలు పడ్డాయి. మీకు చెప్పిందెవరు? కలియుగం అంతమవుతుందా? మీరే అంతమవుతున్నారా? అనే ప్రశ్నలు వచ్చాయి. మనిషి మేధస్సు పెరిగినా ఇంకా మూఢనమ్మకాలు తగ్గడం లేదనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మనిషిలో ఇంతటి అమాయకత్వమా? ఎందుకింత నైరాశ్యం. మనుషుల జీవితాలతో చెలగాటం.
మనిషి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవడం ఖాయమే. కానీ ఇలా ప్రకృతి పరంగా ప్రాణాలు పోతున్నాయని అందరిని బెదరగొడుతూ ఆస్ర్టేలియలో చేసిన హంగామా చూస్తే ఇంత దారుణమా అనే అనిపిస్తుంది. కొంచెమైనా ఆలోచన రాలేదా? మనుషుల అంతమెప్పుడో తెలియడం లేదా? ఒక ఆస్ర్ట్టేలియన్లు కలియుగ అంతం కనబడుతోందా? అనే సందేహాలు కూడా అందరిలో వస్తున్నాయి. కానీ చీటికి మాటికి మనుషులను బెదరగొడుతూ ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే.
Also Read:Arjun Sarja: షాకింగ్ : ప్రముఖ స్టార్ హీరోకి మాతృవియోగం