https://oktelugu.com/

Rashmika Mandanna- Venu Swamy: రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక

Rashmika Mandanna- Venu Swamy: సౌత్ ఇండియా లో ప్రస్తుతం హీరోయిన్ రష్మిక కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..చలో సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది..ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యాయి..లేటెస్ట్ గా పుష్ప సినిమా నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మన అందరికి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2022 / 05:41 PM IST
    Follow us on

    Rashmika Mandanna- Venu Swamy: సౌత్ ఇండియా లో ప్రస్తుతం హీరోయిన్ రష్మిక కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..చలో సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది..ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యాయి..లేటెస్ట్ గా పుష్ప సినిమా నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో ఆమె సంపాదించిన ఫేమ్ మామూలుది కాదు..ఏకంగా బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టింది అంటే ఆ సినిమా ఆమెకి తెచ్చిన పాపులారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..కోలీవుడ్ లో కూడా ఈమె హవా నే నడుస్తుంది..అక్కడి స్టార్ హీరో విజయ్ సరసన రష్మిక ‘వారిసు’ అనే సినిమాలో నటిస్తుంది..వంశి పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా సాగుతుంది..ఇది ఇలా ఉండగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రష్మిక జాతకం గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

    Rashmika Mandanna- Venu Swamy

    ఆయన మాట్లాడుతూ రష్మిక హైదరాబాద్ లోని తన నివాసం లో నా చేత ప్రత్యేక పూజలు చేయించుకుందని, ఆ సమయం లో ఆమె జాతకం చూశానని..ఆమె జాతక రీత్యా రాజకీయ అరంగేట్రం చేస్తుందని చెప్పుకొచ్చాడు..రాజకీయాల్లోకి రావడమే కాకుండా ఎంపీ గా కూడా ఆమె లోక్ సభలోకి అడుగుపెట్టబోతుందని వేణు స్వామి ఈ సందర్భంగా మాట్లాడాడు..కర్ణాటక లోని ఒక ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయబోతోందని..అఖండ మెజారిటీ తో అక్కడ నుండి ఆమె గెలవబోతుందని వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

    Also Read: Arjun Sarja: షాకింగ్ : ప్రముఖ స్టార్ హీరోకి మాతృవియోగం

    Rashmika Mandanna

    చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రష్మిక రాజకీయ అరంగేట్రం చెయ్యడం ఏంటి అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా లో అంటున్నారు..వేణు స్వామి గతం లో ఆయన చెప్పినట్టుగానే సమంత మరియు నాగ చైతన్య విడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆ ఒక్క అంశం ని పట్టుకొని సోషల్ మీడియా లో టాలీవుడ్ స్టార్స్ జాతకాలు చెప్తూ మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు వేణు స్వామి..మరి ఆయన చెప్పినట్టే రష్మిక రాజకీయాల్లోకి అడుగుపెడుతుందో లేదో చూడాలి.

    Also Read:NTR- Sridevi: శ్రీదేవి జీవితంలో ఎన్టీఆర్ చెప్పిందే జరిగింది.. ఇంతకీ ఏమిటో తెలుసా అది ?

    Tags