Unstoppable With NBK Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ భాగం నిన్న ఆహా మీడియా లో అప్లోడ్ అయ్యింది..మొదటి పార్ట్ మొత్తం ఫన్ తో నిండిపోగా రెండవ పార్ట్ మొత్తం ఫన్ మరియు ఎమోషన్ తో నిండిపోయింది..ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటుగా అతని బెస్ట్ ఫ్రెండ్, మాచో హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు..వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహం ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.

అంత పెద్ద స్టార్ హీరోలు అయ్యుండి కూడా ఇంత సింపుల్ గా, మన నిజజీవితం లో స్నేహితులు ఎలా అయితే ఉంటారో అలాగే ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు..అలా సరదాగా సాగిపోతున్న సమయం లో కృష్ణం రాజు ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభాస్ చాలా ఎమోషనల్ అయిపోతాడు..అది చూసి ఫ్యాన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..

బాలయ్య బాబు ఒకప్పుడు ప్రభాస్ గురించి గర్వపడుతూ మాట్లాడిన మాటలను స్క్రీన్ మీద ప్లే చేస్తాడు..అది చూసి ప్రభాస్ చాలా ఎమోషనల్ అయిపోతాడు..ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు మా కుటుంబం మొత్తం ఇంత సంతోషం గా బ్రతుకుతున్నాము అంటే దానికి కారణం పెదనాన్న గారే..ఆయన లేని లోటు నా జీవితం లో ఎవ్వరు పూడవలేరు..ఆయన నుండి ఎన్నో మంచి లక్షణాలను నేర్చుకున్నాను..ఎంత పెద్ద శత్రువు అయినా ఇంటికి వచ్చినప్పుడు కడుపునిండా అన్నం పెట్టి పంపించడం పెదనాన్న లో ఉన్న గొప్ప లక్షణం..నాకు కూడా ఆయన ఆ విషయం చెప్పేవారు..ఒక తండ్రి లాగ ఆయన నామీద చూపించిన వాత్సల్యం నేను ఎప్పటికి మర్చిపోలేను..ఈరోజు ఆయన మమల్ని ఇంత తొందరగా వదిలి వెళ్ళిపోతాడని మేము అనుకోలేదు’ అంటూ ప్రభాస్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు..అప్పటి వరకు సరదాగా ఉన్న వాతావరణం నిశబ్దం గా మారిపోయింది..బాలయ్య బాబు ప్రభాస్ ని హత్తుకొని ఓదారుస్తాడు.
https://www.youtube.com/watch?v=-RXGaauZgPw&t=2s