https://oktelugu.com/

Bangalore : అందరి ముందు చీర విప్పేసింది.. ఏంటా సాహసం..

అయితే అధికారులు వచ్చి సహాయ చర్యలు చేపట్టే వరకూ ఆగి ఉంటే ఐదు నిండు ప్రాణాలు బలయ్యేవి. అటువంటి సమయంలో ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి మహిళ చూపిన తెగువ అందర్నీ ఆకర్షించింది. ఆలోచింపజేసింది. తాను కట్టుకున్న చీరను ఎలాంటి సంకోచం లేకుండా ఇచ్చేసిన ఆమె త్యాగానికి.. అందరూ ఆమెను అభినందించారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 23, 2023 / 06:59 PM IST
    Follow us on

    Bangalore : ఆత్మాభిమానానికి ప్రతీకలు మహిళలు. ప్రాణం కంటే మానానికే ఎక్కువ విలువ ఇస్తారు. ప్రాణం పోయిన పర్వాలేదు. కానీ శరీరం దాచుకునేందుకే ప్రాధాన్యమిస్తారు. అటువంటిది ఓ మహిళ రోడ్డుపైనే తన చీరను విప్పేసింది. అందరూ చూస్తుండగానే దుశ్చర్యకు పాల్పడింది. కానీ ఆమె అలా చేసి ఐదుగురి ప్రాణాలను కాపాడడం కోసమే. ప్రాణాపాయంలో ఉన్న ఐదుగురి ఆర్తనాదాలు చూసి తన చీరను తాడుగా మార్చి వారిని ఒడ్డుకు చేర్చింది. పునర్జన్మను ఇచ్చింది. బెంగళూరు సిటీలో జరిగిన ఈ ఘటనలో ఆ మహిళ తెగువ నీరాజనాలు అందుకుంటోంది. ఆమెకు అందరూ సలామ్ చేస్తున్నారు.

    ఈ మధ్యన భారీ వర్షాలు బెంగళూరును కుదిపేసిన సంగతి తెలిసిందే, కేఆర్ కూడలి సమీపంలోని అండర్ పాస్ లోకి పొంగు కు వచ్చిన నీటిలో మునిగి ఏపీ కి చెందిన భానురేఖ అనే మహిళ మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషాద ఉదంతంలో ఆమెతో పాటు మరో ఐదుగురు కూడా మరణించాల్సి ఉంది. కాకుంటే ఒక మహిళ ప్రదర్శించిన తెగువ.. సాహసం ఐదు నిండు ప్రాణాల్ని కాపాడింది. అటువైపుగా వెళుతున్న మహిళకు నీటిలో చిక్కుకున్న వారి కేకలు వినిపించాయి.  అక్కడికి వెళ్లి చూడగా.. కారులో చిక్కుకున్న వారిని ఓ మీడియా ప్రతినిధి  కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే.. తన కు ఎవరైనా తాడు లాంటిది ఏదైనా ఇవ్వాలని కోరుతున్నా.. అందరూ చూసే వారే కానీ.. ఎవరూ ఇవ్వలేదు. దీంతో సదరు మహిళ క్షణం ఆలోచించలేదు. ఆ వెంటనే తను కట్టుకున్న చీరను విప్పేసి.. తాడుగా మార్చేందుకు వీలుగా ఆ యువకుడికి ఇచ్చింది. దీంతో అండర్ పాస్ కు ఉన్న ఇనుప ఊచలకు ఆ మహిళ ఇచ్చిన చీరను కట్టి.. కారులో ఉన్న వారికి అందించారు. కారులో ఉన్న వారు ఆ చీర సాయంతో ఒక్కొక్కరుగా బయటకు రాగలిగారు.

    అయితే అధికారులు వచ్చి సహాయ చర్యలు చేపట్టే వరకూ ఆగి ఉంటే ఐదు నిండు ప్రాణాలు బలయ్యేవి. అటువంటి సమయంలో ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి మహిళ చూపిన తెగువ అందర్నీ ఆకర్షించింది. ఆలోచింపజేసింది. తాను కట్టుకున్న చీరను ఎలాంటి సంకోచం లేకుండా ఇచ్చేసిన ఆమె త్యాగానికి.. అందరూ ఆమెను అభినందించారు. అక్కడే ఉన్న మరో మహిళ తన దుప్పట్టా ను ఇస్తే.. మరో యువకుడు తన చొక్కాను విప్పి ఆమెకు ఇచ్చాడు. అయితే మహిళ తెగువ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.