Congress Alliance : తెలంగాణలో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్?

రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం.. ఈ ఐదు రాష్ట్రాలకు వచ్చే డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగబోతున్నాయి.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో అందివచ్చే అందరినీ కలుపుకొని పోవాలని కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.

Written By: NARESH, Updated On : May 23, 2023 7:03 pm
Follow us on

Congress Alliance  : కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణ రాజకీయాలు వేగంగా ముందుకు వెళుతున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వం త్వరత్వరగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా అర్థమవుతోంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నాలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం.. ఈ ఐదు రాష్ట్రాలకు వచ్చే డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగబోతున్నాయి.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో అందివచ్చే అందరినీ కలుపుకొని పోవాలని కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.

ఈ మేరకు షర్మిలతో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ,అయితే వాటికి తాను సమాధానం చెప్పడం లేదని షర్మిల చెప్పారు.

ఇప్పుడు స్వయంగా ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో సంప్రదింపులు చేయడం, దీనికి డీకే శివకుమార్ మధ్యవర్తత్వం వహించడంతో పొత్తు పెట్టుకునే దిశగానే ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం నడుస్తుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.డీకే శివకుమార్ త్ షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో, ఆయన ద్వారానే షర్మిలను ఒప్పించి కాంగ్రెస్ తో కలిసి నడిచే విధంగా చేసేందుకు కాంగ్రెస్ .ప్రయత్నాలు చేస్తూ ఉండడం, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఏపీ తెలంగాణలో ఆ వర్గం ప్రజల్లో కాంగ్రెస్ పై ఆదరణ పెరుగుతుందనే అంచనాలతోనే షర్మిల తో ప్రియాంక మంతనాలు చేస్తున్నారట.

ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపించగల పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా కలుపుకుపోవాలని ఆయన చేర్పించడం లేదంటే.. ఆయన పార్టీ పెడితే కలిసి నడవడం ద్వారా రెడ్డి సామాజికవర్గంను ఒక్కటి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ కు ఆశాజనక పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..