Punjab : ఇంత బతుకు బతికి ఇంటి వెనుకల చచ్చినట్టు…రూ.8.5 కోట్లు దోపిడీ చేసి రూ.10 కూల్ డ్రింక్ కోసం కక్తుర్తి పడి పోలీసులకు దొరికిపోయారు ఓ గజదొంగ జంట. మీరు నిజమైన డాన్ యేనా?అన్న బ్రహ్మానందం కామెడీ మాటలు గుర్తుకు తెచ్చేలా ఆ జంట అడ్డంగా బుక్కయ్యింది. కటకటాలపాలైంది. పంజాబ్ లోని లూథియానాలో వెలుగుచూసింది ఈ ఘటన. లూథియానాలో డాకూ హసీనా అలియాస్ మణ్ దీప్ కౌర్ అనే మహిళ ఉండేది. గతంలో ఓ బీమా సంస్థలో ఏజెంట్ గా పనిచేసేది. విపరీతంగా అప్పులు చేసిన ఆమె రుణదాతల నుంచి ఒత్తిడితో భర్త జస్వీందర్ సింగ్ తో కలిసి దొంగతనాలకు అలవాటు పడింది. మరో పది మందితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలే వృత్తిగా మార్చుకుంది.
ఈ నెల 10న లూథియానాలోని ఇన్ఫోసిస్ అనే ఫైనాన్స్ సంస్థలో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. అక్కడి సిబ్బందిని బంధించి రూ.8.5 కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. భర్త జస్వీందర్ తో కలిసి మణ్ దీప్ నేపాల్ చెక్కేయ్యాలని డిసైడయ్యింది. పనిలోపనిగా పుణ్యక్షేత్రాలు సందర్శించాలని భావించారు. అనూహ్యంగా ముఠాలో గౌరవ్ అనే నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనిచ్చిన సమాచారం మేరకు మరో ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మణ్ దీప్ దంపతులు హరిద్వార్, కేథారినాథ్ దర్శించుకున్నారని.. వారి తర్వాత టూర్ హేమ్ కుండ్ సాహేబ్ క్షేత్రమని తెలుసుకున్నారు. పోలీసులు ఆ క్షేత్రాన్ని చుట్టుముట్టారు. అయితే విపరీతమైన భక్తులు తాకిడి ఉండే ఈ క్షేత్రంలో వారి ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారింది.
అయితే వారిని పట్టుకునేందుకు పోలీసులు సరికొత్త ఎత్తుగడ వేశారు. ఇక్కడకు వచ్చేది సిక్కు భక్తులు కావడంతో వారి ముఖంపై ఉండే వస్త్రం తొలగిస్తే కానీ పట్టుకోలేరు. అందుకే భక్తులకు డ్రింకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పోలీసులు భావించినట్టే డ్రింకుల కోసం భక్తులు ఎగబడ్డారు. అందులో మణ్ దీప్ దంపతులు కూడా ఉన్నారు. డ్రింకు తాగే క్రమంలో ముఖంపై వస్త్రాన్ని తీయాల్సి వచ్చింది. దీంతో పోలీసులు వారిని పసిగట్టి వెంబడించడం ప్రారంభించారు. క్షేత్రంలో ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన తరువాత వారిని అదుపులోకి తీసుకున్నారు. రూ.21 లక్షల నగదుతో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. బీమా ఏజెంట్ గా ఉన్నమణ్ దీప్ ధనవంతురాలిగా మారాలన్న క్రమంలో దొంగగా మారింది. అనూహ్యంగా పోలీసులకు పట్టుబడింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The robbers who were running away with rs 8 49 crores were caught by the police after giving them rs 10 frouti
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com