Devara Movie: హిట్టు మీద హిట్టు కొడుతూ అభిమానులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఈయన గత ఏడాది #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ ఫేమ్ ని కూడా దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన కొరటాల శివ తో ‘దేవర’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఈ చిత్రం లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గానే ‘ఆదిపురుష్’ సినిమా తో మన తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితమయ్యాడు. రెండవ షెడ్యూల్ నుండి ఈయన కూడా షూటింగ్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు.
రీసెంట్ గా జరిగిన ఒక షెడ్యూల్ లో సైఫ్ అలీ ఖాన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశం మాములు రేంజ్ కాదు, సముద్రపు అడుగున ఇద్దరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు. ఈ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించడానికి భారీ గా ఖర్చు చేశారట. ఈ ఫైట్ సీన్ లో ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ డూప్ లేకుండానే అండర్ వాటర్ లో ఫైట్ చేశారట. ఈ చిత్రం లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
అందులో ఒక పాత్ర పేరు ‘దేవర’, ఆ పాత్ర కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. గత ఏడాది విడుదల చేసిన థీమ్ వీడియో కి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.