Pawan Kalyan OG Movie: అభిమానులతో పాటుగా ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అమితాసక్తిని ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ చిత్రం #OG. ప్రముఖ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గ్యాప్ లేకుండా కొనసాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి రోజుకొక్క ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో లీక్ అవుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక అసలు విషయానికి ఈ #OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ఇన్ని రోజులు అందరూ అనుకుంటూ వచ్చారు.
అది నిజమే, దాంతో పాటుగా #OG అనే టైటిల్ లో మరో అర్థం కూడా ఉందట. ఇందులో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ పేరు ‘గాంధీ’, ‘O’ అంటే ఆయన ఇంటిపేరు తో మొదలయ్యే అక్షరం, రెండిటిని కలిపితే #OG. గాంధీ అనే పాత్రని డైరెక్టర్ సుజిత్ వేరే లెవెల్ పవర్ ఫుల్ గా డిజైన్ చేసాడట. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇలాంటి పవర్ ఫుల్ పాత్ర ని ఎవ్వరూ చేయలేదట, ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఆ పాత్ర ని వెండితెర మీద చూసి షాక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు మేకర్స్.
ఇక ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి అన్నయ్య , వదినలుగా కిక్ శ్యామ్ మరియు శ్రియా రెడ్డి నటిస్తున్నారు. శ్రీయా రెడ్డి క్యారక్టర్ చాలా రఫ్ గా మరియు పవర్ ఫుల్ గా ఉంటుందట ఈ సినిమాలో. రీసెంట్ గానే ఆమె షూటింగ్ లో కూడా పాల్గొన్నది. ఇప్పటికి ఈ సినిమా ప్రారంభమై 39 రోజులు అయ్యిందట, ఈ 39 రోజుల్లో ముంబై మరియు పూణే లో రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసారు.
ఇప్పుడు హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ చేస్తున్నారు. నిన్ననే ముంబై విలన్ గ్యాంగ్స్ చేసింగ్ ఫైట్ సీన్ ని తెరకెక్కించారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ లో బిజీ గా ఉన్నాడు. అందుకే ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు మేకర్స్. అక్టోబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్ లో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.