
Desamuduru Re Release Collection: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల హిట్ సినిమాలను రీ మాస్టర్ చేసి, థియేటర్స్ లో ఘనంగా విడుదల చెయ్యడం, దాని ద్వారా వచ్చిన డబ్బులను ఎదో ఒక మంచి పనికి ఉపయోగించడం వంటి కార్యక్రమాలు గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అలా చేసిన ఖుషి, జల్సా మరియు పోకిరి సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
రీ రిలీజ్ కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పాయి.ఇప్పుడు రీసెంట్ గా ఆ జాబితాలోకి చేరింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘ఆరెంజ్’ సినిమా. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈమధ్యనే ఘనంగా విడుదల చేసారు. ఈ చిత్రం ద్వారా వచ్చే వసూళ్లు మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి విరాళం గా ఇస్తున్నట్టు ఆ చిత్ర నాగబాబు ఇదివరకే అధికారిక ప్రకటన చేసారు.
అయితే త్వరలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు రాబోతుంది.ఈ సందర్భంగా అభిమానులు అల్లు అర్జున్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘దేశ ముదురు’ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఏప్రిల్ 7 మరియు 8 వ తేదీలలో రెండు కొత్త సినిమాలు విడుదల అవ్వబోతున్న సందర్భంగా దేశముదురు సినిమాని రెండు రోజులు ముందుగా, అనగా ఏప్రిల్ 6 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రిపరేషన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేసారు.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి వచ్చే వసూళ్లను ఏదైనా మంచి కార్యక్రమాలకు ఉపయోగించబోతున్నారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.’ఆరెంజ్’ చిత్రానికి చేసినట్టు గానే ఈ సినిమాకి వచ్చిన వసూలన్నీ జనసేన పార్టీ కి ఇవ్వబోతున్నారా అంటే లేదనే చెప్పాలి. దీనిని బట్టే అర్థం అవుతుంది ఏమిటంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ని దూరం పెడుతున్నాడని తెలుస్తుంది.