
Rahul Sipligunj Remuneration: జీవితంలో సినిమాకు మించిన నాటకీయత ఉంటుంది. అందుకు రాహుల్ సిప్లిగంజ్ జీవితం ఒక ఉదాహరణ. ఆస్కార్ వేదికపై పాడటం లెజెండ్స్ కి కూడా దక్కని అవకాశం. ఆస్కార్ గెలవడం కలలో కూడా కలగని తలంపు. అలాంటి ఒక అరుదైన విజయం ఆయన సొంతమైంది. ప్రపంచ సినిమా వేదిక మీద నాటు నాటు సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ జర్నీ ఎలా మొదలైంది. ఆయన ఫస్ట్ సాంగ్ రెమ్యూనరేషన్ ఎంత అనే ఆసక్తి అందరిలో ఉంది. తాజా ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ ఈ మేరకు వెల్లడించారు.
రాహుల్ సిప్లిగంజ్ చిన్నప్పుడు ఇంట్లో వంట పాత్రలను వాయిస్తూ పాటలు పాడేవాడట. వీడిలో టాలెంట్ ఉందని గ్రహించిన వాళ్ళ నాన్న… మ్యూజిక్ నేర్పించాలనుకున్నారట. రాహుల్ తాతగారు ఫేమస్ గజల్ సింగర్ అట. దీంతో ఏడేళ్లు గజల్స్ లో రాహుల్ సిప్లిగంజ్ శిక్షణ తీసుకున్నాడట. ఆ సమయంలో డబ్బింగ్ చిత్రాలకు సాంగ్స్ పాడేవారట. శాటిలైట్ ప్రసారం కోసం తమిళ, మలయాళ, కన్నడ డబ్బింగ్ చిత్రాలకు తెలుగు పాటలు పాడించేవారట. అలా పాటకు రూ. 500 ఇచ్చేవారట.
అంటే రాహుల్ సిప్లిగంజ్ మొదటి పాట రెమ్యూనరేషన్ రూ. 500 అనుకోవచ్చు. తర్వాత ‘నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి’ చిత్రంలో ఒక పాట పాడాడట. ఒక మిత్రుడి ద్వారా ఆ అవకాశం వచ్చిందట. రాహుల్ పని చేసిన మొదటి పెద్ద చిత్రం జోష్. అనూప్ రూబెన్స్ ఆ చిత్రంలో ‘కాలేజీ బుల్లోడా’ సాంగ్ పాడించారట. జోష్ నాగచైతన్య డెబ్యూ మూవీ అన్న విషయం తెలిసిందే. తర్వాత కీరవాణి వద్ద కొన్నాళ్ళు పనిచేశాడట. ఆయన టీమ్ లో కోరస్, అప్పుడప్పడూ ట్రాక్స్ పాడేవాడట. కీరవాణి తనని చాలా ప్రోత్సహించారట.

అనంతరం మణిశర్మ, అనిరుధ్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అవకాశాలు ఇచ్చారని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఫేమ్ వచ్చాక ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేయడం స్టార్ట్ చేశాడట. అవి సక్సెస్ కావడంతో మరింత పేరు వచ్చిందని రాహుల్ వెల్లడించారు. మరి ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు పాడినందుకు ఆయన ఎంత తీసుకున్నారు? ఈ విషయాన్ని ఆయన గతంలో వివరించారు. నాటు నాటు సాంగ్ కి ఆయన రెమ్యూనరేషన్ రూ. 3 లక్షలట. డబ్బుల మేటర్ పక్కన పెడితే ఆ సాంగ్ పాడటం వలన రాహుల్ పొందిన గౌరవం కోట్లు కుమ్మరించినా దక్కదు.