Costly Medicine: మనిషి అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. మరీ గత దశాబ్ద కాలంలో కొత్త కొత్త వ్యాధులు మనుషులకు సవాల్ విసిరాయి. వీటి దెబ్బకు సుమారు 6 లక్షల మంది కన్నుమూశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా కోవిడ్ లాంటి మహమ్మారి మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసింది. దాని సరసన సార్స్, మంకీ ఫాక్స్, ఎబోలా వంటి వైరస్ సంక్రమిత వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో పుట్టిన వైరస్ లే. ఈ వ్యాధులను నియంత్రించే క్రమంలో అప్పట్లో శాస్త్రవేత్తలు తయారు చేసిన ఔషధాలు చాలా ఖరీదుగా ఉండేవి. కోవిడ్ సమయంలో రెమి డేసివీర్ ఔషధానికి ఎంత డిమాండ్ ఉందో చూశాం కదా! ఒక్కో ఇంజక్షన్ కు లక్ష దాకా వసూలు చేశారు. లక్ష అంటేనే అప్పట్లో అందరూ నోరు వెళ్లపెట్టారు. కానీ దాని కంటే విలువైన ఔషధాలు మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల అత్యంత విలువైన ఔషధం మార్కెట్లోకి వచ్చింది. విలువైనది అంటే లక్షో.. చివరికి పది లక్షలో కాదు. మన ఊహకు కూడా అందనంత ఖరీదైన ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఆస్ట్రేలియా కంపెనీ ఘనత
మన శరీరంలో రక్తానికి సంబంధించిన రుగ్మతలు ఇప్పటికీ కొరకరాని కొయ్యలే. ఎనీమియా, హిమోఫిలియా, తల సేమియా.. వంటి వ్యాధులు ఇప్పటికీ వైద్య రంగానికి సవాల్ విసురుతూనే ఉన్నాయి. వీటిల్లో తల సేమియాకి ఇప్పటికీ మందు లేదు. రోగి జీవితాంతం రక్తం ఎక్కించుకుంటూ నే ఉండాలి. ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ… 30 ఏళ్లలోపే ప్రాణాలు పోతాయి. ఇక హిమోఫిలియాకు సంబంధించి ఆస్ట్రేలియా కు చెందిన సి ఎస్ ఎల్ లిమిటెడ్ అనే కంపెనీ ఒక ఖరీదైన మెడిసిన్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఖరీదు అక్షరాల 29 కోట్లు. ఈ ఔషధానికి అమెరికా ఎఫ్డిఏ సైతం ఆమోద ముద్ర వేసింది. హీమో ఫీలియా అంటే.. రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. ఈ తరహా వ్యాధి ఉన్న వ్యక్తి శరీరంలో హెపారిన్ ఉండదు. పూర్తిగా జన్యు సంబంధిత వ్యాధి.. ఈ వ్యాధి ఉన్న వ్యక్తికి గాయం అయితే రక్తం అదేపనిగా కారుతూ ఉంటుంది. ఇందులోనూ హిమోఫిలియా ఏ, హిమోఫిలియా బి అనే రకాలు ఉన్నాయి.. హిమోఫిలియా అనే వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది.. అయితే ఆస్ట్రేలియా కంపెనీ తయారుచేసిన ఔషధాన్ని హిమో ఫీలియా_ బీ ని నయం చేసేందుకు వాడుతారు. వాస్తవానికి జన్యుపరమైన వ్యాధులను నివారించేందుకు ఇంతవరకు కూడా సరైన ఔషధాలు అందుబాటులోకి రాలేదు. మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా కంపెనీ ఈ తరహా ఔషధాన్ని తయారుచేసి రికార్డు సృష్టించింది.. అయితే ఈ కేటగిరీలో గతంలో రెండు ఔషధాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి కూడా అత్యంత ఖరీదైనవే. ఒకటి 2.8 మిలియన్ డాలర్లు అయితే, మరొకటి మూడు మిలియన్ డాలర్లు.. ప్రతి 40 వేల మందిలో ఒకరికి మాత్రమే జన్యు సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు అంటున్నారు.
దీనిలోపం వల్ల..
సాధారణంగా మన కాలేయంలో ఫాక్టర్ _9 ప్రోటీన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది శరీరంలో రక్త ఉత్పత్తిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. రక్తం గడ్డ కట్టడంలో తోడ్పడుతూ ఉంటుంది.. ఈ ప్రోటీన్ లోపం కారణంగా హిమోఫిలియా అనే వ్యాధి వస్తుంది. అయితే ఆస్ట్రేలియా కంపెనీ తయారుచేసిన ఈ ఔషధం కాలేయంలో ఫ్యాక్టర్ 9 అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల శరీరం రక్తం గడ్డకట్టించే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది.

ఇది చాలా ప్రత్యేకం
గతంలో హిమోఫిలియా_బీ నివారణకు సంబంధించి అనేక ఫార్మా కంపెనీలు మందులను అందుబాటులోకి తెచ్చాయి.. అదే ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది జన్యుపరమైన చికిత్స. అత్యంత ఖరీదైన ఈ చికిత్సలో ఒక ప్రత్యేకమైన జన్యు పదార్థాన్ని కాలేయంలో ప్రవేశపెడతారు.. దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. ఫ్యాక్టర్ -9 ను కాలేయం తనంతట తాను ఉత్పత్తి చేసుకునేలా ప్రేరేపిస్తుంది. దీనివల్ల శరీరం రక్తం రక్తాన్ని గడ్డకట్టించే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది.. అయితే ఈ ఔషధం విక్రయాలను అమెరికా మొదలుపెట్టింది. హిమోజెనిక్స్ పేరుతో విక్రయాలు చేస్తోంది.. అయితే ఈ తరహా జన్యు సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో అమెరికా ముందు వరుసలో ఉంది.. అయితే గతంలో అమెరికాకు సంబంధించిన కంపెనీలు ప్రయోగాలు చేసినప్పటికీ… ఫలితం దక్కలేదు.. కానీ ఆ ఘనతను ఆస్ట్రేలియా కంపెనీ సాధించింది.