Viral News : పిచ్చి తలకు ఎక్కింది. రోకలి చుట్టండి అన్నాడట వెనకటికి ఒకడు. ఇతడి వ్యవహారం కూడా అలానే ఉంది. సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. చాలామందికి రాత్రికి రాత్రే ఫేమస్ కావాలనే పిచ్చి పట్టుకుంది. అందుకే వింత వింత పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు అవి శృతిమించి సభ్య సమాజానికి ఇబ్బంది కలుగజేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో స్పైడర్ మాన్ వేషధారణతో ఓ యువకుడు బైక్ పై రకరకాల స్టంట్ లు చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతనికి గుర్తించి అరెస్టు చేశారు.. ఆ ఘటన మర్చిపోకముందే ఢిల్లీలో మరో ఉదంతం చోటుచేసుకుంది.
ఢిల్లీలోని అత్యంత ట్రాఫిక్ ఉండే ఓ రోడ్డులో ఓ వ్యక్తి ఏకంగా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. పక్కనే తన బైక్ కూడా పార్క్ చేసుకున్నాడు. కళ్ళకు గాగుల్స్, మెడలో కండువా, షార్ట్, కాటన్ షర్టు వేసుకొని సర్దార్ లాగా ఫోజ్ ఇచ్చాడు. పైగా ఒక డ్రోన్ ఇదంతా చిత్రీకరిస్తున్నది. ఇదంతా దేనికంటే రీల్స్ కోసమట.. పైగా అంతటి బిజీ ట్రాఫిక్ లోనూ అతడు రీల్స్ షూటింగ్ కోసం నడిరోడ్డును ఆక్రమించడాన్ని.. కుర్చీ వేసుకుని కూర్చోడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. అయినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు. దీంతో కొంతమంది వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రీల్స్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వాస్తవానికి మనదేశంలో ఢిల్లీ లాంటి ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఏ రోడ్డు చూసినా అత్యంత బిజీగా కనిపిస్తుంది. అలాంటి రోడ్డు మీద ఆ వ్యక్తి రీల్స్ చేసేందుకు కుర్చీ వేసుకుని కూర్చున్నాడంటే మామూలు విషయం కాదు. అతడు అలా కూర్చోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. కొంతసేపు అతడు అలానే ఉంటే రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడేది. పైగా అతడు కూర్చున్న సమయంలో డ్రోన్ విజువల్స్ చిత్రికరిస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలంటే సమాజ హితమైన పనులు చేయాలి. పేదలకు సహాయపడాలి. లేదా ఇంకా ఏమైనా గొప్ప గొప్ప కార్యాలు చేపట్టాలి. అంతేతప్ప నడిరోడ్డు మీద రీల్స్ చేయడమేంటో ఆ యువకుడికే తెలియాలి. అన్నట్టు వాహనదారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. లెఫ్ట్, రైట్ క్లాస్ పీకి వదిలేశారు.
#Delhi Police arrested a person after his reel went viral on social media. In the video, the person can be seen sitting on a chair in the middle of the road along with his motorcycle.#viral #viral2024 #ViralVideo #DelhiPolice #Reels #Tiktok #instagram #RushDriving pic.twitter.com/zx4D0g0sMh
— Siraj Noorani (@sirajnoorani) April 27, 2024