https://oktelugu.com/

Monkey Love: ఒక్క అరటిపండు ఇచ్చిన వ్యక్తి కోతి ప్రేమ.. వదలనంటూ పట్టేసింది.. వైరల్ వీడియో

ఓ వ్యక్తి కోతులకు పండ్లు పంచేందుకు వెళ్లాడు. అరటి పండ్లు అక్కడ కోతులకు వేశాడు. దీంతో వాటిని కోతులన్నీ తీసుకుని తినడం మొదలు పెట్టాయి. కాసేపు వాటిని చూసిన సదరు వ్యక్తి అక్కడి బయల్దేరాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 5, 2023 / 03:47 PM IST

    Monkey Love

    Follow us on

    Monkey Love: జంతువులకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. కొన్నింటిని చూస్తే తెగ నవ్వు వస్తుంది. ఇందులో కోతులకు ప్రథమస్థానం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వింత చేష్టలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇందులో కోతి పిల్ల చేసిన హడావుడీ అంతా ఇంతా కాదు.

    పండ్లు తెచ్చిన వ్యక్తితో..
    ఓ వ్యక్తి కోతులకు పండ్లు పంచేందుకు వెళ్లాడు. అరటి పండ్లు అక్కడ కోతులకు వేశాడు. దీంతో వాటిని కోతులన్నీ తీసుకుని తినడం మొదలు పెట్టాయి. కాసేపు వాటిని చూసిన సదరు వ్యక్తి అక్కడి బయల్దేరాడు. దీంతో ఓ కోతి పిల్ల ఒక్కసారిగా వచ్చి అతని కాళ్లు పట్టుకుంది. వెళ్లొద్దంటే వెళ్లొద్దు అన్నట్లు అతడిని వదలలేదు. ఇక్కడే ఉండిపో అన్నట్లు మారాం చేసింది.

    ఎంత ప్రయత్నించినా..
    ఆ కోతి పిల్లను వదిలించుకునేందుకు సదరు వ్యక్తి అనేక రకాలుగా ప్రయత్నించాడు. దూరంగా తరిమాడు. అయినా ఆ కోతి పిల్ల మళ్లీ అతని వద్దకే వచ్చి కాళ్లు పటుకుని కదలకుండా చేసింది. తరిమినా కోపం తెచ్చుకోకుండా బతిమాలినట్లుగా కాళ్లు పట్టుకుంది.

    చివరకు ఇలా..
    ఇక కోతి పిల్ల ఎంతకీ వదలక పోవడంతో సదరు వ్యక్తి.. చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ పిల్లను తన వెంట తీసుకెళ్లాలని డిసైడ్‌ అయ్యాడు. దీంతో ఆ కోతిపిల్లను తన చేతుల్లోకి తీసుకుంది. దానిని తీసుకెళ్లి కారులో కూర్చోగా బయటకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కామ్‌గా కూర్చుండిపోయింది. దీంతో అతనికి అర్థమైంది. కోతి తనతో రవాలని అనుకుంటుందని గుర్తించాడు. దీంతో ఆ పిల్లను తన వెంట తీసుకువెళ్లాడు.

    సోషల్‌ మీడియాలో వైరల్‌..
    కోతిపిల్ల మారాం చేసే ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చిన్న పిల్లవాడిలా నేను వెంట వస్తా అన్నట్లుగా పండ్లు తెచ్చిన వక్తిని పట్టుకుని వదలని తీరు చూసిన నెటిజన్లు తెలివైన కోతి పిల్ల… వెళ్లిపోతే పండ్లు దొరకవని అలా చేసింది. గుడ్‌ డిసీజన్‌.. అంటూ కామెంట్స్‌ పెతున్నారు.