Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ కి సంబంధించిన మొట్టమొదటి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ తమ తో కలిసి ఆడేందుకు తమ బెస్ట్ ఫ్రెండ్ ని పార్టనర్ గా ఎంచుకుని వారం మొత్తం జంటగా ఆడాల్సి ఉంటుంది. చెప్పిన విధంగా కంటెస్టెంట్స్ జంటలుగా మారి ఆటకి సిద్ధమయ్యారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సమయానుసారంగా వివిధ టాస్క్ లు ఇస్తూ వచ్చాడు . ఈ టాస్క్ లో గెలిచిన బడ్డీ జంటకి కెప్టెన్సీ పోటీదారులుగా అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పాడు.
ఇందుకు గాను బిగ్ బాస్ ఇచ్చిన మొదటి గేమ్ ‘మీ నవ్వుని నింపండి’. ఈ టాస్క్ లో గెలిచి మొదటి స్థానంలో గౌతమ్ -శుభశ్రీ కి మూడు స్టార్స్ ,రెండవ స్థానంలో ఉన్న అమర్ -సందీప్ కి రెండు స్టార్స్ ,మూడవ స్థానంలో ఉన్న ప్రశాంత్ – శివాజీ ఒక్క స్టార్ తో కొనసాగుతుండగా ,చివరి రెండు స్థానాల్లో ప్రియాంక -శోభా ,యావర్ -తేజ ఉన్నారు . ఇక రెండవ టాస్క్ గురించి మాట్లాడుకుంటే ”దొరికితే దొంగ దొరక్కపోతే దొర ”. కంటెస్టెంట్స్ దొంగలు గా మారి బిగ్ బాస్ చెప్పిన వస్తువులు సేకరించాల్సి ఉంటుంది .ఈ టాస్క్ లో గెలిచి ఫస్ట్ ప్లేస్ లో శివాజీ – ప్రశాంత్ ,సెకండ్ ప్లేస్ లో శోభా -ప్రియాంక ,థర్డ్ ప్లేస్ లో గౌతమ్ -శుభశ్రీలు నిలిచారు .
ఇక మూడవ టాస్క్ బిగ్ బాస్ ఫ్రూట్ నింజా ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ జంటలు లోని ఒక సభ్యులు ఫ్రూట్స్ విసిరితే రెండవ వారు వాటిని బాస్కెట్ లో క్యాచ్ పట్టుకుని ,ఆ ఫ్రూట్ జ్యూస్ ను జార్ లో నింపాలి . ఎక్కువ జ్యూస్ తీసిన జంట విన్నర్ గ నిలిచి మూడు స్టార్స్ పొందుతారు . ఇందులో యావర్ -తేజ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు .
ఇక కెప్టెన్సీ రేస్ లో ఈ రోజు బిగ్ బాస్ ఇచ్చిన ఆఖరి టాస్క్ ”చిట్టీ ఆయీ ” కంటెస్టెంట్స్ కి వాళ్ళ ఇంటి నుండి కొన్ని చిట్టీలు వచ్చాయి . వాటిని చూసి కంటెస్టెంట్స్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు . చిట్టీలు చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు . దాన్ని బట్టి చూస్తే కంటెస్టెంట్స్ ఆ చిట్టిలను త్యాగం చెయ్యాలని అర్ధమౌతుంది . కుంటుంబ సభ్యులు పంపించిన చిట్టీలు కావడంతో వాటిని త్యాగం చెయ్యలేక అందరూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు . కన్నీటి పర్యంతం అయ్యారు .
