Deepest Breath Trailer: టైటానిక్ శిథిలాలను వీక్షించాలని ఐదుగురు సాహసికులు చేసిన ప్రయత్నం విషాదాంతం అయ్యింది. ఓషన్ గేట్ సంస్థకు చెందిన టైటాన్ సబ్ మెర్సిబుల్ అట్లాంటిక్ సముద్రంలో పేలిపోయింది. దాదాపు నాలుగు వేల మీటర్ల లోతులో టైటాన్ సబ్ మెర్సిబుల్ నీటి పీడనాన్ని తట్టుకోలేకపోయింది. అంత లోతులో పదివేల టన్నుల ఒత్తిడి ఉంటుంది. అది ఒక ఈఫిల్ టవర్ బరువుతో సమానం. టైటాన్ సబ్ మెర్సిబుల్ పేలుడుకు గురైందని అధికారులు ధ్రువీకరించారు. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించినట్లు స్పష్టం చేశారు.
వరల్డ్ వైడ్ ఈ సంఘటన సంచలనం రేపిన నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ లేటెస్ట్ డాక్యూమెంటరీ ప్రమోషన్స్ వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ది డీపెస్ట్ బ్రీత్ డాక్యూమెంటరీ జులై 19 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. ఫ్రీ డైవింగ్ స్పోర్ట్స్ ఆధారంగా ది డీపెస్ట్ బ్రీత్ డాక్యుమెంటరీ రూపొందింది. ఫ్రీ డైవింగ్ సాహస క్రీడగా ఉంది. ప్రాణాలకు తెగించి నీటిలో ఊపిరి బిగబట్టి ఆడాల్సిన ఆట.
అందరికంటే ఎక్కువ లోతు వరకు ఊపిరి బిగపట్టి వెళ్లగలిగిన డైవర్ విజయం సాధిస్తాడు. ది డీపెస్ట్ బ్రీత్ డాక్యూమెంటరీని లారా మెక్ గన్ రూపొందించారు. ది డీపెస్ట్ బ్రీత్ ట్రైలర్ విడుదల వివాదాస్పదం అవుతుంది. సముద్ర గర్భంలో ట్రాజిక్ ఈవెంట్ చోటు చేసుకున్న సమయంలో ఇలాంటి డాక్యూమెంటరీ స్ట్రీమింగ్ అవసరమా అంటున్నారు. నెటిజెన్స్ ది డీపెస్ట్ బ్రీత్ ప్రమోషన్స్ కి ఇది సరైన సమయం కాదంటున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ది డీపెస్ట్ బ్రీత్ ప్రమోషన్స్, స్ట్రీమింగ్ కి వ్యతిరేకంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సర్వత్రా విమర్శల నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ వెనక్కి తగ్గుతుందా? అవేమీ పట్టించుకోకుండా అనుకున్న ప్రకారం జులై 19న స్ట్రీమ్ చేస్తుందా? అనేది చూడాలి. టైటాన్ సబ్ మెర్సిబుల్ ప్రమాదం వరల్డ్ వైడ్ ఎంత ప్రభావం చూపిందో చెప్పేందుకు ఇది నిదర్శనం.
In freediving, a single breath can be the difference between life or death.
The Deepest Breath, a new documentary, premieres July 19 pic.twitter.com/XLeH5D1YMm
— Netflix (@netflix) June 20, 2023