Homeట్రెండింగ్ న్యూస్No Rain Village: ఆ ఊరిలో చినుకే పడదు.. అది ఎక్కడుందో తెలుసా?

No Rain Village: ఆ ఊరిలో చినుకే పడదు.. అది ఎక్కడుందో తెలుసా?

No Rain Village: వర్షాలతో దేశం అతలాకుతలమవుతోంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరతో సంబంధం లేకుండా వానలు దంచి కొడుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వరదల్లో మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో చినుకు పడని ఊరు లేదు.. కానీ ఈ గ్రామం ఎండిపోయింది. అక్కడ ఎప్పుడూ వర్షాలు పడవు. దీంతో వాతావరణం కూడా చాలా పొడిగా ఉంటుంది. పగటిపూట చాలా వేడిగా.. రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది. మరి ఆ ఊరు పేరేంటి.. అది ఎక్కడుందో తెలుసుకుందాం..

ఈ భూమి రహస్యాలకు పుట్టినిల్లు. కొన్ని వింతలు చూస్తుంటే..ఆశ్చర్యపోక తప్పదు. ఈ ప్రపంచంలో అంతుచిక్కని మిస్టరీస్‌ ఎన్నో ఉన్నాయి.. ఓ చోట ఎండలు మండిపోతాయి. మరోచోట చలి వణికిస్తుంది. మరోచోట ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇంకోచోట అస్సలు వర్షమే కురవదు. అవాస్తవంగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం! ప్రపంచంలో ఎప్పుడూ వర్షాలు పడని గ్రామం ఉంది. వర్షాల్లేక దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు గడుపుతున్నారు.
చినుకు లేక ఎండిపోయిన ఊరు..

: ఈ భూమి మీద వర్షం కురవని ఆ వింత గ్రామం పేరు ‘అల్‌–హుతైబ్‌’. ఇది యెమెన్‌ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. ఇక్కడ వర్షం కురవక పోయినా జనాలు హాయిగా జీవిస్తారు. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామంలో వాతావరణం వేడిగా ఉంటుంది. శీతా కాలంలో ఉదయం చల్లగా, మధ్యాహ్నం వేడిగానూ ఉంటుంది. ఇక్కడి పరిస్థితులు ఆ గ్రామ ప్రజలకు అలవాటే. ఈ వింత ప్రదేశానికి వచ్చేందుకు పర్యాటకులు క్యూ కడతారు. ఈ గ్రామంలో పాత కాలపు నిర్మాణలతో పాటు.. కొత్త నిర్మాణాలు కూడా దర్శనమిస్తాయి. ఎప్పుడూ వర్షం పడకపోవటానికి కారణం ఈ గ్రామం మేఘాలకు మించి ఎత్తులో ఉంటుంది. ఈ విలేజ్‌ కు దిగువ భాగాన మాత్రం మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాలు పడటాన్ని ఈ గ్రామస్తులు చూస్తారట ప్రపంచవ్యాప్తంగా సంవత్సరంలో వివిధ సమయాల్లో వర్షాలు కురుస్తాయి. కానీ అల్‌ హుతేబ్‌ గ్రామం మాత్రం ఎండిపోయింది.

నీటి సరఫరా ఎలా అంటే..
వాస్తవానికి యెమెన్‌లో నీటి సమస్య ఎక్కువే. పైగా సనాలో అది మరీ ఎక్కువ. ప్రపంచంలో ‘డ్రై సిటీ’ రాజధాని ఇదొక్కటే. దీంతో సనా మున్సిపల్, వాటర్‌ కార్పొరేషన్‌ ఈ సమస్యలను తీర్చడానికి 2007లో కొత్త పద్ధతులు ఎంచుకుంది. మొబైల్‌ వాటర్‌ ట్యాంకర్లతో సిటీ మొత్తం వాటర్‌ సరఫరా చేస్తోంది. అక్కడ ఎతై ్తన గ్రామంగా ఉన్న అల్‌ హుతైబ్‌కు కూడా మొబైల్‌ ట్యాంకులతో పాటు, పైపులతో నీళ్లను అందిస్తోంది.

టూరిస్టులకు స్వర్గధామం
కొండపై ఈ గ్రామం ఉండడం వల్ల మేఘాల ప్రయాణం చాలా బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా వర్షం పడితే కొండపై నుంచి కిందికి వస్తూ వర్షాన్ని తాకొచ్చు. అలాగే కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రజల జీవిన విధానం, ఇళ్ల ఆర్కిటెక్చర్, చేతికందే మేఘాలు ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ గ్రామాన్ని చూసేందుకు టూరిస్టులు అధికంగా వస్తుంటారట. అల్‌ హుతైబ్‌ కొండపై ‘క్వాట్‌’ అనే మొక్కలను ఎక్కువ పండిస్తారు. దీని నుంచి పూలు, మందులు తయారు చేస్తారు. ప్రధాన ఆదాయంగా ‘క్వాట్‌ కల్టివేషన్‌’ ఈ గ్రామంలో ఉంటుంది. దీనికి సనా వాటర్‌ కార్పొరేషన్‌ ఈ మొక్కల సాగు కోసం 37 శాతం నీటిని అల్‌ హుతైబ్‌కు అందిస్తుంది.

చిలీలోనూ వర్షం కురవని ఊరు..
చిలీలోని అటకామా ఎడారిలో కలామా అనే పట్టణంలో ఇప్పటి వరకు చినుకు కురిసిన దాఖలాలే లేవు. ఆ ఊరిలో లక్షా ఇరవై వేల సంవత్సరాలుగా నదులన్నీ ఎండిపోయి ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మూడు మిలియన్‌ సంవత్సరాల కంటే ముందు నుంచే అటకామా ప్రాంతం ఎడారిగా ఉంది. ఈ ప్రాంతం భూమిపై అత్యంత పురాతన ఎడారిగా గుర్తింపు పొందింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version