Kalachi Village: నిద్ర అనేది చాలా అవసరం. సాధారణంగా ఆరు నుంచి ఏడు గంటల పాటు నిద్ర ఆరోగ్యవంతమైన వ్యక్తికి అవసరం అంటారు నిపుణులు. అయితే కొందరు 10 నుంచి 12 గంటలు కూడా నిద్ర పోతారు. ఇదిలా ఉంటే ఓ గ్రామంలో మాత్రం ఏకంగా నెలల పాటు నిద్రపోతారట. మరి ఆ గ్రామం ఏంటి? అనుకుంటున్నారా? రామాయణంలో కుంభకర్ణుని గురించి తెలిసిందే. రావణాసురిడి సోదరుడు కుంభకర్ణుడు ఒక్కసారి నిద్ర పోతే ఆరునెలల పాటు నిద్రలేవడనే విషయం తెలిసిందే. కుంభకర్ణుడి నిద్రలా ఆ గ్రామ ప్రజలు కూడా నిద్ర పోతారట.
కజకిస్తాన్ లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజలు చాలా నెలల పాటు నిద్రిస్తూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి కనీసం నెల పాటు నిద్రపోతాడట. ఇక్కడ నిద్ర పోయిన వ్యక్తి నెల పాటు లేవడట. అందుకే ఈ ఊరును స్లీపీ హోల్ అని అంటారు. వారి దగ్గర బాంబు పేల్చిన కూడా నిద్రలేవరట. వీరు ఆ నిద్ర కావాలి అనుకోరట. ఇలాంటి నిద్ర వల్ల ఆ ఊరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారట. కొన్ని సార్లు ఒక వ్యక్తి రోడ్డు మీద కూడా నిద్ర పోతాడట. నెల రోజులు అక్కడే అలాగే పడుకుంటాడట.
ఈ కలాచి గ్రామంలో సుమారు 600 మంది ఉన్నారట. ఇందులో 14 శాతం మంది ఇలాంటి సమస్యతోనే బాధ పడుతున్నారు అని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే 2010లో ఓ పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల దీనికి సంబంధించిన విషయాలు బయట ప్రపంచానికి తెలిశాయి. కొందరు విద్యార్థులు క్లాసులోనే నిద్రపోయి కొన్ని రోజుల పాటు నిద్రలేవలేదట. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా ఒక్కరు నిద్రలేవకపోయేసరికి.. ఈ విషయం బయటకు వచ్చింది. అలా ఈ వ్యాధితో 14 శాతం మంది బాధపడుతున్నారని తెలిసింది.
ఈ విషయం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కూడా దానికి సంబంధించిన కారణాలు తెలిసిరావడం లేదు. కానీ ఓ వ్యాధి వల్లే ఈ సమస్యకు ప్రధానం కారణం అంటున్నారు. కానీ శాస్త్రవేత్తలు ఈ వాదనను నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారట. మొత్తం మీద ఒక వింత వ్యాధి వల్లే ఈ కలాచి గ్రామ ప్రజలు నిద్ర పోతున్నారని తెలుస్తోంది.