Nikhil 18 Pages Movie: ఫ్లాప్ అనుకున్న సినిమా హిట్ అయిపోయింది.. నిఖిల్ అదృష్టం మామూలుగా లేదు

Nikhil 18 Pages Movie: కార్తికేయ 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నిఖిల్ నుండి వచ్చిన చిత్రం ’18 పేజెస్’..సుకుమార్ రైటింగ్స్ నుండి వచ్చిన సినిమా కావడం..అది కూడా కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉండేవి..సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..టాక్ పెద్దగా అయితే […]

Written By: Neelambaram, Updated On : January 11, 2023 8:19 am
Follow us on

Nikhil 18 Pages Movie: కార్తికేయ 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నిఖిల్ నుండి వచ్చిన చిత్రం ’18 పేజెస్’..సుకుమార్ రైటింగ్స్ నుండి వచ్చిన సినిమా కావడం..అది కూడా కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉండేవి..సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..టాక్ పెద్దగా అయితే రాలేదు.

Nikhil

మరో పక్క అదే రోజు మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ మూవీ విడుదలై వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుండడం తో ’18 పేజెస్’ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు..దీనితో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు..ఓపెనింగ్స్ కూడా పెద్దగా ఏమి రాలేదు..ట్రేడ్ వర్గాలు కూడా ఈ మూవీ పై ఆశలు వదిలేసుకున్నాయి.

కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా A సెంటర్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ఇప్పుడు సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంది..ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది..అందువల్ల బ్రేక్ ఈవెన్ కూడా చాలా తేలికగా అయిపోయింది..అలా అసలు విడుదల అయ్యిందో లేదో అన్నట్టు అనిపించినా ఈ సినిమా నెమ్మదిగా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాలు రప్పించుకోవడం అందరిని సర్ప్రైజ్ కి గురి చేసింది.

Nikhil

కార్తికేయ 2 తర్వాత పెద్ద ఫ్లాప్ తప్పదు అనుకున్న నిఖిల్ కి సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం..అయితే పాన్ ఇండియా రేంజ్ ఇమేజి వచ్చిన తర్వాత అలాంటి సినిమాలే చెయ్యాలి కానీ, ఇలాంటి చిన్న సినిమాలు చెయ్యొద్దు అంటూ నిఖిల్ ని అభిమానించేవారు సోషల్ మీడియా లో సలహాలు ఇస్తున్నారు.