https://oktelugu.com/

Nabha Natesh: ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణం గా ఉందో తెలుసా!

Nabha Natesh: గడిచిన రెండు మూడు సంవత్సరాలలో ఇండస్ట్రీ కి పరిచయమైనా కొత్త హీరోయిన్స్ లో చూడగానే అందరిని ఆకట్టుకున్న హీరోయిన్స్ లో ఒకరు నభా నటేష్..పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ తొలిసినిమాతోనే అందం తోను మరియు నటన తోను అందరిని ఆకట్టుకుంది..ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది..భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుందని అందరూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 11, 2023 / 08:28 AM IST
    Follow us on

    Nabha Natesh: గడిచిన రెండు మూడు సంవత్సరాలలో ఇండస్ట్రీ కి పరిచయమైనా కొత్త హీరోయిన్స్ లో చూడగానే అందరిని ఆకట్టుకున్న హీరోయిన్స్ లో ఒకరు నభా నటేష్..పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ తొలిసినిమాతోనే అందం తోను మరియు నటన తోను అందరిని ఆకట్టుకుంది..ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది..భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు.

    Nabha Natesh

    కానీ అనుకున్న రేంజ్ లో అయితే ఈమె ఇండస్ట్రీ లోకి దూసుకురాలేకపోయింది..ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ తో ఈమె ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చేసింది..సూపర్ హిట్ అయ్యింది..ఆ తర్వాత నితిన్ తో మాస్ట్రో అనే సినిమా చేసింది..ఇది నేరుగా ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఇలా మంచి సక్సెస్ రేట్ ఉన్న కూడా ఈమెకి ఎందుకు అవకాశాలు రావడం లేదని అందరూ అనుకున్నారు.

    Nabha Natesh

    అయితే గత ఏడాది మొత్తం ఆమె సినిమాల్లో నటించకపోవడానికి కారణం ని ఈరోజు సోషల్ మీడియా లో అభిమానులతో చెప్పుకుంది..ఆమె మాట్లాడుతూ ‘మీరందరు నన్ను బాగా మిస్ అవుతున్నారని నాకు తెలుసు..నేను కూడా మిమల్ని బాగా మిస్ అవుతున్నాను..కానీ గత ఏడాది మొత్తం నేను సినిమాలు చేయకపోవడానికి కారణం..నాకు జరిగిన రోడ్డు ప్రమాదమే..ఆ కారు యాక్సిడెంట్ లో నా భుజాలు బాగా దెబ్బ తినింది..దీనితో మానసికంగా మరియు శారీరకంగా నేను ఎంతో నరకం అనుభవించాను..కానీ ఇప్పుడు నేను ఆ చికిత్స నుండి కోలుకున్నాను..త్వరలోనే సినిమాలు చేయబోతున్నాను..మిమల్ని ఎప్పటిలాగానే అలరిస్తాను..ఈ ప్రమాదం తర్వాత నేను మరింత బలంగా తయారయ్యాను..మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి’ అంటూ నభా నటేష్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది..ఆమె తన భుజం కి తగిలిన దెబ్బ కూడా ఫోటో తీసి అప్లోడ్ చేసింది..అది చూసిన అభిమానులు నభా నటేష్ ని జాగ్రత్తగా ఉండమని..నువ్వు త్వరలోనే కోలుకుంటావు అంటూ ఆమెకి ధైర్యం ఇస్తున్నారు.