
Harasment : ఆయనో ప్రజాప్రతినిధి. నియోజకవర్గానికి ఎమ్మెల్యే. కానీ చేసే పనులు మాత్రం అసలు బాగా లేవు. దీంతో ఆయనపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన ఆయన అడ్డదారులు తొక్కుతున్నారు. అడ్డదారుల్లో సంపాదన కోసం అర్రులు చాస్తున్నారు. అక్రమార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఎంతకైనా తెగిస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని చెడు దారుల్లోనే వెళ్తున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసి వారితో చేయకూడని పనులు చేయించేందుకు సిద్ధపడుతున్నారు.
మద్యం తాగించేందుకు..
అమ్మాయిలను ఎమ్మెల్యే తన గెస్ట్ హౌస్ కు పిలిపించాడు. అక్కడ వారిని మద్యం తాగమని వేధించాడు. దీంతో వారు నిరాకరించడంతో దౌర్జన్యం చేశాడు. వారిని ఒక్కొక్కరు తన వద్దకు రావాల్సిందిగా ఆదేశించాడు. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో వారిపైనే కేసు పెట్టేందుకు సిద్ధపడ్డాడు. దీంతో విషయం కాస్త మీడియాకు చేరింది. ఎమ్మెల్యే బండారం బయట పడింది. ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రజాప్రతినిధే అడ్డ దారులు తొక్కితే. కంచే చేను మేసిన చందంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన వారే వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసం.
ఎందుకిలా..
ఎమ్మెల్యే ఎందుకిలా మారారు. లక్షల్లో వేతనం, అన్ని సదుపాయాలు ఉన్నా అడ్డదారులు ఎందుకు తొక్కాల్సి వస్తోంది. సమస్యలు తీర్చాల్సిన వారే వాటిని సృష్టిస్తే ఎలా. పరువు గల కుటుంబాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వారి అవసరం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అడిగేవాడు లేడనే దురుద్దేశంతో వారిని నిండా మోసం చేస్తున్నారు. చెబితే వింటే సరే లేకపోతే వారిపై లేనిపోని కేసులు పెట్టేందుకు సైతం వెనకాడటం లేదు.
గెస్ట్ హౌస్ కు..
సదరు ఎమ్మెల్యే వారిని గెస్ట్ హౌస్ కు పిలిపించారు. అక్కడ వారిని మద్యం తాగమని ఆదేశించారు. వారు ససేమిరా అనడంతో ఇక చేసేది లేక వారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు కూడా వెనకాడలేదు. నేను చెప్పినట్లు వినకపోతే మీ భవిష్యత్ అంధకారమే అని బెదిరించారు. మంచి కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు కావడంతో తాము మద్యం తాగమని తెగేసి చెప్పేశారు. ఏం చేసినా మేం మద్యం తాగం. మీరు చెప్పినట్లు వినం అని స్పష్టం చేశారు. తరువాత మీడియాకు విషయం చెప్పారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.