Tamil Nadu Car Driver: బ్యాంకు అధికారుల తప్పిదం.. కారు డ్రైవర్ ఖాతాలోకి 9 వేల కోట్లు.. చివరికి ఏం జరిగిందంటే?

కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలోకి 9,000 కోట్లు వచ్చిపడ్డాయి. అయితే జరిగిన తప్పిదాన్ని గ్రహించిన బ్యాంకు అధికారులు అతడిని బుజ్జగించి, బతిమాది అతడి ఖాతా నుంచి తిరిగి ఆ డబ్బును తీసేసుకున్నారు.

Written By: Bhaskar, Updated On : September 22, 2023 9:28 am

Tamil Nadu Car Driver

Follow us on

Tamil Nadu Car Driver: అతడు ఒక కారు డ్రైవరు.. గిరాకీ బాగుంటే రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు. గిరాకీ మరీ బాగుంటే ఓ పదిహేను వందలు వెనక్కి వేస్తాడు. ఈ లెక్క ప్రకారం చేసుకుంటే నెలకు 40 నుంచి 45,000 దాకా సంపాదిస్తాడు. కానీ అలాంటి వ్యక్తి ఖాతాలోకి ఒకేసారి 9,000 కోట్లు వచ్చి పడ్డాయి.. దీంతో ఒక్కసారిగా అతడు షాక్ కు గురయ్యాడు. అసలు తను చూస్తోంది నిజమేనా? తన ఖాతాలో 9,000 కోట్లు ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోయాడు.. 9000 కోట్లు ఖాతాలో ఉన్నాయని ఎగిరి గంతేశాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే..

కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలోకి 9,000 కోట్లు వచ్చిపడ్డాయి. అయితే జరిగిన తప్పిదాన్ని గ్రహించిన బ్యాంకు అధికారులు అతడిని బుజ్జగించి, బతిమాది అతడి ఖాతా నుంచి తిరిగి ఆ డబ్బును తీసేసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిండిగల్ జిల్లా నేయకార పట్టికి చెందిన రాజ్ కుమార్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.. అతడికి తమిళ నాడు మర్కంటైల్ బ్యాంక్ లో వ్యక్తిగత ఖాతా ఉంది. అయితే ఒకరోజు ఉన్నట్టుండి అతడి సెల్ ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది.. ఆ మెసేజ్ చూసిన తర్వాత ఆశ్చర్య పోవడం అతని వంతయింది.

ఆ బ్యాంకు నుంచి రాజ్ కుమార్ సెల్ ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. దాని ప్రకారం అతడి వ్యక్తిగత ఖాతాలో తొమ్మిది వేల కోట్లు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది.. అయితే ఇది నిజమో కాదో తెలుసుకునేందుకు తన స్నేహితుడి ఖాతాకు అతడు 21,000 జమ చేసాడు. రెండు రోజుల తర్వాత పొరపాటు జరిగిందని ఆ బ్యాంకుకు చెందిన టి నగర్ అధికారులు రాజ్ కుమార్ ను సంప్రదించారు.. ఆ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవద్దని అతడికి ఫోన్ లోనే సూచించారు. అనంతరం పోలీసులు, న్యాయవాదులతో కలిసి రాజ్ కుమార్ వద్దకు వచ్చారు. జరిగిన పొరపాటును వివరించారు.. ఆ డబ్బుని వెనక్కి తీసుకునేందుకు సహకరించాలని కోరారు. అంతేకాదు రాజ్ కుమార్ తన స్నేహితుడికి పంపిన 21,000 తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో మరేదైనా రుణ సహాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాజ్ కుమార్ బ్యాంకు అధికారులు చెప్పినట్లు సంతకాలు చేసి.. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. కాగా, బ్యాంకు అధికారులు చేసిన తప్పిదం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 9000 కోట్లను ఖాతా నెంబర్ చూసుకోకుండా ఎలా బదిలీ చేస్తారంటూ ఉన్నత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.. కాకా ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటన తమిళ మీడియాలోనే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.