Forest Man: మొక్కలు నాటడం మంచి సంస్కృతి పెరుగుతున్న జనాభాతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దీంతో మొక్కల పెంపకాన్ని ప్రభుత్వాలు ఉద్యమంలా చేపడుతున్నాయి. అడవుల నరికివేతతో పర్యావరణం దెబ్బతింటోందని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరిస్తోంది. అయితే భారత దేశానికి చెంది ఓ వ్యక్తి 42 ఏళ్లుగా మొక్కలు నాటుతూ ఫారెస్ట్ మెన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందాడు. మరి అతను ఎవరు.. ఎన్ని మొక్కలు నాటాడు.. అతని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
అసోంకు చెందిన జాదవ్ పాయక్..
అసోమ్‌కు చెందిన జాదవ్ అసోంలోని జోర్‌హాట్‌కు చెందిన వ్యక్తి 1979లో అసోంలో భారీ వరదలు వచ్చాయి. దీంతో బ్రహ్మపుత్ర నదిలోని జలచరాలన్నీ భూమిపైకి కొట్టుకు వచ్చాయి. వరద తగ్గాక ఇసుక దిబ్బలు వేడెక్కడంతో చాలా వరకు జీవులు చనిపోయాయి. అది చూసి తట్టుకోలేకపోయాడు జాదవ్.
మొక్కలు నాటాలని సంకల్పించి..
నాడు 16 ఏళ్ల వయసులో ఉన్న జాదవ్.. మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. నాటి నుంచి నిత్యం ఒక మొక్క నాటుతూ వస్తున్నాడు. అసలు మొక్కలే పెరగని ఇసుక నేలలో 42 ఏళ్లుగా మొక్కలు నాటుతున్నాడు. పది కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,300 ఎకరాల్లో అడవిని పెంచాడు. ఇప్పుడు ఇందులో జీవులు, పక్షులు, మృగాలు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి.
జాదవ్ నిక్‌నేమ్‌తో..
జాదవ్ నిక్‌నేమ మూలా.. దీంతో అతను మొక్కలు నాటుతూ పెంచిన అడవికి అతడి పేరే పెట్టారు మూలాయ్ ఫారెస్ట్‌గా పిలుస్తున్నారు. జాదవ్ ప్రకృతి సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీతో సత్కరించింది.
అమెరికా పుస్తకాల్లో పాఠంగా..
ఇక జాదవ్ కృషిని అమెరికా ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయన జీవిత చరిత్రను అక్కడి ఆరోతరగతి పుస్తకాల్లో ముద్రించి విద్యార్థులకు బోధిస్తున్నారు.