India Vs England: ఒకే తరంగధైర్ఘ్యంతో, ఒకే పౌన: పుణ్యంతో రెండు శబ్దాలు కలిసిపోయి ఒకే తీరుగా వినిపిస్తాయి. ఇంగ్లీషులో టింబర్ ఆఫ్ సౌండ్ అంటారు. శుక్రవారం రాంచివేదికగా ఇంగ్లాండ్ జట్టుతో మొదలైన నాలుగో టెస్ట్ లో భారత బౌలర్ సిరాజ్ టింబర్ ఆఫ్ సౌండ్ అంటే ఎలా ఉంటుందో తన బౌలింగ్ ద్వారా చూపించాడు. చదువుతుంటే కాస్త అతిశయోక్తి లాగా అనిపిస్తున్నప్పటికీ.. అతడు చేసిన బౌలింగ్ అలానే ఉంది మరి.
ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మూడు వికెట్లను కొత్త బౌలర్ ఆకాష్ పడగొట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ క్రీజ్ లోకి వచ్చి బెన్ స్టోక్స్ మినహా మిగతా వారందరితో మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఫలితంగా ఒకవైపు ఇంగ్లాండ్ వికెట్లు పడిపోతున్నప్పటికీ మెరుగైన స్కోర్ సాధించింది. ఈ నేపథ్యంలో జో రూట్ తన బజ్ బాల్ ఆటకు స్వస్తి పలికి సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడాడు.. ఫలితంగా సెంచరీ సాధించగలిగాడు. మూడో వికెట్ పడిపోయిన అనంతరం మైదానంలోకి వచ్చిన అతడు.. ఆట ముగిసే వరకు అలానే వికెట్ కు అంటి పెట్టుకుని ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ లో ఏమాత్రం ప్రభావం చూపని రూట్..ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు.
ఇక తొలి రోజు ఇంగ్లాండ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 245 పరుగులుగా ఉన్నప్పుడు..క్రీ జ్ లో జో రూట్, హార్ట్ లీ ఉన్నారు. జో రూట్ స్కోర్ 82, హార్ట్ లీ 13 పరుగుల వద్ద ఉన్నారు. 75 ఓవర్ వేయాలి అని కెప్టెన్ రోహిత్ శర్మ ఆదేశించడంతో.. సిరాజ్ బౌలింగ్ అందుకున్నాడు. అప్పటికి ఒక బంతి వేశాడు. రెండవ బంతిని ఆఫ్ స్వింగర్ గా హార్ట్ లీ వైపు సంధించాడు. అయితే మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఆ బంతిని అతడు తప్పుగా అంచనా వేశాడు. దీంతో అది అంతే వేగంగా వికెట్లను గిరాటేసింది. ఏం జరుగుతుందో హార్ట్ లీ చూసేలోపే బెయిల్స్ గాల్లో గింగిరాలు కొట్టాయి.
ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. సిరాజ్ బంతివేగానికి బెయిల్స్ గాల్లో ఎగిరాయని, అప్పుడు ఆ శబ్దం దట్ సౌండ్ ఆఫ్ టింబర్ లాగా వినిపించిందని బిసిసిఐ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
I. C. Y. M. I
!
That was an absolute cracker!
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @mdsirajofficial | @IDFCFIRSTBank pic.twitter.com/gHUIuQZdRL
— BCCI (@BCCI) February 23, 2024