
Saloni Aswani: గడిచిన రెండు దశాబ్దాలలో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఎంతో మంది హీరోయిన్స్ లో అచ్చ తెలుగు అమ్మాయిలాగా అనిపించినా నటీమణులు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ కొంతమందిలో ఒకరే సలోని. చూసేందుకు మన పక్కింటి అమ్మాయిలాగా కనిపించే ఈ హీరోయిన్ తెలుగు, హిందీ , తమిళం మరియు కన్నడ భాషలకు కలిపి సుమారుగా 20 సినిమాల్లో నటించింది.

ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలలో ‘మర్యాద రామన్న’ ఒక్కటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.కన్నడ, హిందీ మరియు తమిళ బాషలలో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి కానీ, తెలుగు లో మాత్రం పెద్ద హిట్ అంటే ఇదే.రాజమౌళి లాంటి దర్శకుడు ఆమె పేరు మీద ‘రాయే రాయే సలోని’ వంటి పాట పెట్టాడంటే ఆమె రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బాడీ గార్డ్ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసినందుకు గాను సలోని కి సైమా అవార్డు కూడా వచ్చింది.

అలా కెరీర్ లో దూసుకుపోతున్న ఈమె ఎందుకో 2016 వ సంవత్సరం నుండి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఈమె వెండితెర మీద కనిపించిన చివరి చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఇందులో ప్రముఖ కమెడియన్ పృథ్వి కి జంటగా నటించింది.ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. అయితే సినిమాలకు దూరం అయ్యినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఈమె అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ తో అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ఇస్తుంది.

కానీ మళ్ళీ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని , విభిన్నమైన పాత్రలు పోషించాలని ఆమె అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. కానీ సలోని మాత్రం సినిమాలు వద్దు అనే అనుకుంటుంది.ఇది ఇలా ఉండగా ఆమెకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. సినిమాల్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడే ఆమె గ్లామర్ గా కనిపిస్తుంది. మరి ఈ ఫోటోలను చూసి మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్సలలో తెలపండి.