
Lakshmi Pranathi: ఈ రోజుల్లో స్టార్ వైఫ్స్ భర్తలకు మించిన ఫాలోయింగ్ మైంటైన్ చేస్తున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సతీమణులు తెలియనివారు లేరు. వీరు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. అయితే ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి వీరికి పూర్తి భిన్నం. ఆమె చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. సోషల్ మీడియా వాడరు. పబ్లిక్ లో పెద్దగా కనిపించరు. కేవలం ఫ్యామిలీ ఫంక్షన్స్, ప్రైవేట్ ఈవెంట్స్ లో మాత్రమే పాల్గొంటారు. దాదాపు ఆమె ఎన్టీఆర్ తోనే కనిపిస్తారు.
ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎన్టీఆర్ దంపతులు ఇద్దరు కుమారులతో అమెరికా వెళ్లారు. దాదాపు నెల రోజులు అక్కడ ఉన్నారు. అమెరికాలో మాత్రం లక్ష్మీ ప్రణతి చాలా ట్రెండీగా తయారయ్యారు. ఫస్ట్ టైం ఉపాసన అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించారు. తాజాగా లలక్ష్మీ ప్రణతి చార్మినార్ నైట్ బజార్ లో కనిపించారు. ఆమె ఒక్కరే షాపింగ్ చేయడానికి వెళ్లారు. పక్కన ఎన్టీఆర్ లేడు. ఎవరో ఆమె ఫోటోలు క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతున్నాయి.
రంజాన్ పండగ నేపథ్యంలో చార్మినార్ వద్ద షాపింగ్ గొప్పగా ఉంటుంది. గాజులతో పాటు ఇతర అలంకరణ సామాగ్రికి ఈ నైట్ మార్కెట్ బాగా ఫేమస్. దీంతో లక్ష్మీ ప్రణతి షాపింగ్ చేయడానికి వెళ్లారు. అదన్న మాట మేటర్. 2011లో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిలకు వివాహం జరిగింది. వీరిది అరేంజ్డ్ మ్యారేజ్. వీరికి ఇద్దరు కుమారులు కాగా అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని పేర్లు పెట్టారు. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి పేరు తెచ్చుకున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీ చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో చిత్రీకరణ జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారు. ఇక సముద్ర తీర నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్ పాత్ర చాలా రౌద్రంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని కూడా అంటున్నారు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జంటగా నటిస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.