
Heroine Sadha: జయం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది సదా. ఈమె అసలు పేరు సదాఫ్. మొదట్లో ఇలానే పిలిచేవారు. మెల్లగా అది సదాగా స్థిరపడిపోయింది. దర్శకుడు తేజ సదాను హీరోయిన్ చేశారు. నితిన్-సదా జంటగా నటించిన జయం సెన్సేషనల్ విజయం సాధించింది. వందల రోజులు థియేటర్స్ లో ఆడింది. హీరో నితిన్ డెబ్యూ చిత్రంగా తెరకెక్కిన జయం సదాకు భారీ ఫేమ్ తెచ్చింది. ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయి.
అయితే సదా స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడింది. పరాజయాల శాతం ఎక్కువ కావడంతో త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. ఎందుకో సదాకు టాప్ స్టార్స్ పక్కన ఛాన్సులు రాలేదు. ఎన్టీఆర్ కి జంటగా నటించిన నాగ ఆడలేదు. బాలయ్యతో చేసిన వీరభద్ర డిజాస్టర్ అయ్యింది. అయితే సదా కెరీర్లో జయం రేంజ్ హిట్ మరొకటి ఉంది. అదే అపరిచితుడు. దర్శకుడు శంకర్ ఆమెకు అపరిచితుడు చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు.

2005లో విడుదలైన అపరిచితుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం నమోదు చేసింది. అగ్రహారం అమ్మాయిగా లంగా ఓణీలో సదా ఆకట్టుకున్నారు. అపరిచితుడు అనంతరం ఆమెకు ఆ రేంజ్ హిట్ పడలేదు. చిన్నగా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా చిత్రాలు చేసిన సదా స్టార్ కాలేకపోయారు.
2018 తర్వాత ఆమె పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. సదా నటించిన చివరి తెలుగు చిత్రం యమలీల 2. ఈ మధ్య ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బుల్లితెర మీద సందడి చేస్తున్నారు. బీబీ జోడి డాన్స్ రియాలిటీ షోలో సదా జడ్జిగా వ్యవహరించారు. సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ లతో పాటు ఆమె జడ్జి సీట్లో కూర్చున్నారు. బీబీ జోడి ముగియగా… ఫైమా-సూర్య జోడీ టైటిల్ గెలిచారు.

అలాగే సోషల్ మీడియాలో సదా హాట్ హాట్ గా దర్శనమిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద హోమ్లీ లుక్ మైంటైన్ చేసి సదా ఇంస్టాగ్రామ్ లో మాత్రం గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా కోటు సూటు వేసి యమ హాట్ గా కనిపించారు. సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అలాగే సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. తన ప్రొఫెషనల్ కెమెరా పట్టుకుని అడవులకు విహారానికి వెళుతుంటారు.